చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా ‘పోతిరెడ్డిపల్లి’ మూవీ ప్రారంభం

▪️ మూవీ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, మాజీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, రాజ్య‌స‌భ‌ ఎంపీ ఆర్. కృష్ణయ్య, బాబుమోహ‌న్, త‌దిత‌రులు.
▪️ రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్స‌వం

హైదరాబాద్: చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా, మౌనిక‌, సిరి హీరోయిన్లు నటిస్తున్న నూతన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘పోతిరెడ్డిపల్లి’ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఆరాధ్య క్రియేషన్స్ బ్యానర్‌పై జేరమ్ విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ రోయ్య దర్శకత్వం వహిస్తున్నారు.

అక్టోబర్ 5న ఉదయం 9 గంటలకు నిర్వహించిన ఈ చిత్ర పూజా కార్యక్రమానికి అతిథులుగా మాజీ డిఫ్యూటీ సీఎం రాజయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, సీనియ‌ర్ న‌టుడు బాబుమోహ‌న్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు సినీ ప్రముఖులు, చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం తొలి షాట్‌కు సీనియర్ నటుడు బాబు మోహన్ హీరో, హీరోయిన్లపై క్లాప్ కొట్టగా, ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ ‘అమ్మ రాజశేఖర్’ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తెలుగు మూవీ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. దర్శకుడు వి. సముద్ర, ఓయూ శంక‌ర్ గుండేటి ఈ వేడుక‌లో పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా హీరో చాక్లెట్ స్టార్ పవన్ మాట్లాడుతూ, కథకు అనుగుణంగా ఆసక్తికరమైన హారర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలిపారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా చిత్రాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు.

దర్శకుడు అశోక్ రోయ్య మాట్లాడుతూ, ‘‘ఇది నా రెండో సినిమా. ఈ చిత్రాన్ని మరింత వైవిధ్యంగా తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాను. సినీ ప్రముఖులు, ప్రేక్షకుల ఆశీర్వాదాలు, ఆదరణ మాకు ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

దర్శకుడు అమ్మ రాజశేఖర్, హీరోయిన్ తదితరులు చిత్ర విశేషాలను వెల్లడిస్తూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామీణ నేపథ్యంలో రుగ్మతలు, మిస్టరీ, హారర్, సస్పెన్స్ అంశాలను మేళవిస్తూ ఈ కథను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కథలోని మలుపులు, పాత్రల స్వభావం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉంటాయని పేర్కొంది. మరిన్ని వివరాలను త్వరలోనే చిత్రబృందం వెల్లడించనుంది.

చిత్ర వివ‌రాలు

న‌టీన‌టులు: చాక్లెట్ స్టార్ పవన్ (హీరో), మౌనిక‌, సిరి (హీరోయిన్లు), ఇరుముడి ఫేం సాయి స్వ‌రూప్, సునీతా మ‌నోహ‌ర్, ఆనంద్, బ‌ల‌గం ర‌మేష్, సూర్య తేజ‌వ‌త్, రామ‌లింగం, అరుణ్ అఖిల్, శేఖ‌ర్, త‌ను, మ‌నీష్, త‌దిత‌రులు.

బ్యానర్‌: ఆరాధ్య క్రియేషన్స్
సమర్పణ: త్రిపుర మీడియా, ఆరాధ్య క్రియేషన్స్
నిర్మాత – జేరమ్ విష్ణు
దర్శకత్వం – అశోక్ రోయ్య
సంగీతం – ర్యాప్ రాక్ షకీల్
ఎడిటింగ్ – ఉద్ధవ్,
పబ్లిసిటీ డిజైన్స్ – ఉదయ్ జాల
పీఆర్ఓ – అశోక్ ద‌య్యాల‌

TFJA

Recent Posts

కాస్త ఆలస్యంగా వచ్చినా వెంకటేష్ గారి అభిమానులు వంద శాతం సంతృప్తి చెందేలా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ ఉంటుంది: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 - AK47’.…

2 hours ago

“ఎస్ ఆర్ కళ్యాణమండపం” డైరెక్టర్ శ్రీధర్ గాదె, శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెం.3 సినిమా నుంచి టాలెంటెడ్ యాక్ట్రెస్ పూజిత పొన్నాడ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

ఈ చిత్రంలో నర్తకి పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్న పూజిత పొన్నాడ "ఎస్ఆర్ కళ్యాణమండపం" చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి…

6 hours ago

15 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో దూసుకెళ్తున్న యంగ్ టాలెంటెడ్ హీరో వివస్వాన్ ఫోక్ లోర్ అడ్వెంచర్ ఫిలిం “మత్స్య” గ్లింప్స్

యంగ్ టాలెంటెడ్ హీరో వివస్వాన్ నటిస్తున్న ఫోక్ లోర్ అడ్వెంచర్ ఫిలిం "మత్స్య". ఈ చిత్రంతో వివస్వాన్ టాలీవుడ్ లోకి…

1 day ago

ఓటీటీలో అదరగొడుతోన్న ‘అమీర్ లోగ్’

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ మీద మాధవి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అమీర్ లోగ్’.…

1 day ago

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “రోమాంచకం”

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్,…

3 days ago

త్వరలో స్ట్రీమింగ్ కు రాబోతున్న వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్ ఆహా ఒరిజినల్ “నా వైఫ్ మిస్సింగ్”

ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ తో సబ్ స్క్రైబర్స్ ను ఎంగేజ్ చేస్తోన్న ఆహా ఓటీటీ ఇప్పుడు మరో ఎగ్జైటింగ్ సిరీస్…

3 days ago