ముగ్గురు ప్రముఖ దర్శక నిర్మాతల కలయికలో కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో ఖ్యాతి గడించిన తెలుగు దర్శకుడు సుకుమార్, సంచలనమైన చిత్రాలను రూపొందించడంలో పేరు తెచ్చుకొని కాశ్మీర్ ఫైల్స్‌తో దేశవ్యాప్తంగా పాపులరైన బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, కాశ్మీర్ ఫైల్స్ కార్తికేయ 2 వంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్.. ఈ ముగ్గురు కలసి పని చేయబోతున్నారు.ముగ్గురూ సమావేశమై ప్రాజెక్ట్ గురించి చర్చించారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి వివరాలను వారు వెల్లడించలేదు. అయితే అత్యద్భుతమైన ఈ ముగ్గురు సహకారంతో రాబోతున్న చిత్రం ఎక్సయింటింగ్ ప్రాజెక్ట్ కానుంది.అభిషేక్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి కలిసి భారీ బ్లాక్ బస్టర్ ది కాశ్మీర్ ఫైల్స్ అందించారు. వీరిద్దరూ కలిసి మరో రెండు ప్రాజెక్ట్స్‌లో పని చేయనున్నారు. ఈలోగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు.
“సినిమాతో ఇండియాని ఏకం చేయడం. వివరాలు త్వరలో. ఊహించండి? సుకుమార్ (దర్శకుడు, #పుష్ప) + అభిషేక్ అగర్వాల్ (నిర్మాత, #ది కాశ్మీర్ ఫైల్స్) + యువర్స్ ట్రూలీ (#TheKashmirFiles) ”అని ట్వీట్ చేసిన వివేక్ వారి సమావేశంకు సంబధించిన ఫోటోలను పంచుకున్నారు.ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది పెద్ద ప్రశ్న. లెట్స్ వెయిట్ అండ్ సీ!
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…