ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య తాజాగా తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. తన 24 వ చిత్రాన్ని ఎస్ఎస్ అరుణాచలం దర్శకత్వంలో చేయనున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో నాగశౌర్య వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు.తాజాగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడుని ప్రకటించారు మేకర్స్. అనేక చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన స్టార్ కంపోజర్ హారిస్ జయరాజ్ NS24 కి సంగీతం అందించనున్నారు. తెలుగులో చాలా కాలం తర్వాత హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడం విశేషం. అలాగే ఈ చిత్రానికి వీరం, వేదాళం, విశ్వాసం కాంచన 3 లాంటి సూపర్ హిట్ చిత్రాల సినిమాటోగ్రాఫర్ వెట్రి పళనిసామి డీవోపీగా పని చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.
వైష్ణవి ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 1 గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. బేబీ అద్వైత, భవిష్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.దర్శకుడు ఎస్ ఎస్ అరుణాచలం స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం త్వరలో గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. కొందరు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
తారాగణం: నాగశౌర్య
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: ఎస్ఎస్ అరుణాచలం
నిర్మాతలు: శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి
బ్యానర్: వైష్ణవి ఫిల్మ్స్
సమర్పణ: బేబీ అద్వైత, భవిష్య
సంగీతం: హారిస్ జయరాజ్
డీవోపీ : వెట్రి పళనిసామి
పీఆర్వో: వంశీ-శేఖర్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…