శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నమిస్టరీ సినిమా

Must Read

పి.వి.ఆర్ట్స్ పతాకం పై వెంకట్ పులగం నిర్మాతగా తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” మిస్టరీ”.

సుమన్, ఆలీ, తనికెళ్ళ భరణి, రవి రెడ్డి, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి,స్వప్న చౌదరి,పులగం వెంకట్, సత్య శ్రీ,గడ్డం నవీన్, షన్ను , సి.కే. రెడ్డి , శోభన్ బోగరాజు, నేత సింగ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది.


జులై 3 నుండి 21 వరకు హైదరాబాద్ మరియు పరిసరప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. సింగల్ షెడ్యూల్ లో సినిమా షూటింగ్ అంత పూర్తి అవుతుంది. సెప్టెంబర్ చివరి వారం లో విడుదల కు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. సీనియర్ నటులు అలీ, సుమన్, తనికెళ్ళ భరణి ఈ చిత్రం లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమా కి మాటలు- శివ కాకు, సంగీతం- రామ్ తవ్వ, కెమెరా – సుధాకర్ బాట్లే, అసోసియేట్ కెమెరా- శివ లు చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపారు.

Latest News

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. "వానర" చిత్రాన్ని...

More News