అమెరికాలో కొలువుదీరిన”కూచిపూడి పలావ్”

Must Read

ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా కూచిపూడి వెంకట్ షెఫ్ లెస్ కిచెన్ హోటల్ పరిశ్రమలో కనీ వినీ ఎరుగని సరికొత్త సంచలనానికి శ్రీకారం చుట్టిన కూచిపూడి వెంకట్

హోటల్ నిర్వహణలో ఎదురయ్యే అతి పెద్ద సవాల్ “వంట మాస్టర్స్” (షెఫ్స్)ను మెయింటైన్ చేయడం. ఆ సవాలుకే సవాలు విసిరి… సంచలన విజయం సాధించారు ప్రముఖ దర్శకనిర్మాత కూచిపూడి వెంకట్.

“రాజుగారి తోట, మారేడుమిల్లి” హోటల్స్ తో అసాధారణ విజయాలు అందుకున్న కూచిపూడి వెంకట్… తాజాగా “కూచిపూడి పలావ్” అనే సరికొత్త ఆవిష్కరణలో తెలుగోడి సత్తాను ప్రపంచవ్యాప్తం చేయనున్నారు.

ఆంధ్ర, తెలంగాణ, అండమాన్, అరుణాచల్ ప్రదేశ్, అర్జైంటైనా, ఆఫ్రికా, అమెరికా… ఎక్కడైనా సరే.. షెఫ్స్ లేకుండా వేడి వేడిగా అత్యంత రుచికరమైన, ఆరోగ్యవంతమైన పలావ్ వడ్డించే “హోటల్స్”ను దర్జాగా నిర్వహించుకునే అత్యద్భుత అవకాశాన్ని అందిస్తున్నారు. కొన్నేళ్లుగా కూచిపూడి వెంకట్ చేస్తున్న పరిశ్రమ, పరిశోధనల ఫలితంగా రూపుదిద్దుకున్న “కూచిపూడి పలావ్” అమెరికాలో కొలువుదీరింది.

ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త రాజు మండపాటి సారథ్యంలో అమెరికాలో
ఏర్పాటు చేసిన “కూచిపూడి పలావ్”ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, తెలంగాణ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సంయుక్తంగా ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా గల భోజనప్రియులకు తెలుగు రుచిని పరిచయం చేస్తున్న కూచిపూడి వెంకట్, రాజు మండపాటిలను బహుధా అభినందించారు!!

Latest News

య‌ష్ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ రిలీజ్‌కు 100 రోజులు మాత్రమే..సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసిన మేక‌ర్స్‌

కొత్త టెక్నిషియ‌న్స్‌ను అనౌన్స్ చేసిన టీమ్‌ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొద‌లైంది. మార్చి 19, 2026న సినిమా...

More News