‘బేబీ’ సినిమా కాన్సెప్ట్ మాస్‌కు కనెక్ట్ అవుతుంది.. ఆనంద్ దేవరకొండ

Must Read

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలిస్తున్నాయి. ఈ మూవీ జూలై 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర హీరో ఆనంద్ దేవరకొండ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..

ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయిలా కనిపించే సినిమాలు చేశాను. కానీ మొదటి సారి ఓ వైడ్ రేంజ్ ఆడియెన్స్‌ను పలకరించే సినిమాతో వస్తున్నాం.. ప్రీమియర్ షోలు కూడా హౌస్ ఫుల్ అవుతున్నాయి. బేబీ అనేది నా బెస్ట్ జర్నీ. సెట్‌ను, షూటింగ్‌ను మిస్ అవుతున్నాను. ఈ పాత్రను పోషించగలను అని నాలో నమ్మకాన్ని సాయి రాజేష్ అన్నే నింపాడు. నా కెరీర్‌లో బేబీ ఎప్పటికీ నిలిచిపోతుంది.

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ ఉంటాయి. ఆ ఎమోషన్స్‌ను బాగా చూపించాం. వాటికి ఆడియెన్స్ కూడా కనెక్ట్ అవుతారు. ట్రైలర్‌లో చూపించిన ఎమోషన్ కంటే.. సినిమాలో మరో యాభై శాతం ఎక్కువే ఉంటుంది. థియేటర్లో అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.

తొలిప్రేమ ఎప్పటికీ ఓ అందమైన అనుభూతి. తొలి ప్రేమ అనేది పైపైన అందాన్ని చూసి పుడుతుంది. కానీ మెల్లిమెల్లిగా ప్రేమ అర్థాన్ని తెలుసుకుంటారు. దాన్నే ఈ సినిమాలో చక్కగా చూపించాం. నేను బాయ్స్ బోర్డింగ్ స్కూల్‌లోనే చదివాను. బయటకు వచ్చాక అమ్మాయిలతో మాట్లాడేందుకు రెండేళ్లు పట్టింది. తొలి ప్రేమ అనేది ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

ప్రేమ అనంతమైంది. ప్రేమ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో ప్రేమను సాయి రాజేష్ అన్న తన కోణంలోంచి చూపించారు. ఆయన రైటింగ్ కొత్తగా ఉంటుంది. ఆయన కోణంలోంచి ప్రేమను చూపించిన, చెప్పిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. హీరోహీరోయిన్లు ప్రేమలో ఉన్నా, విడిపోతోన్నారని అన్నా ప్రేక్షకులు ఫీల్ అవ్వాలంటే దానికి మ్యూజిక్ ముఖ్యం. విజయ్ బుల్గానిన్ అద్భుతమైన సంగీతం, ఆర్ఆర్ అందించారు.

ప్రేమ దేశం సినిమాకు బేబీ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదు. చాలా కొత్తగా ఉంటుంది. ఫీల్‌ వైజ్ చూస్తే మాత్రం ప్రేమిస్తే, 7/జీ బృంధావన కాలనీ స్టైల్లో ఉంటుంది. ఈ సినిమాలోకి ముందుగా నేను వచ్చాను. ఆ తరువాత వైష్ణవి, విరాజ్‌లు వచ్చారు.

అర్జున్ రెడ్డి అనేది అందరూ రిఫర్ చేసే పాప్ కల్చర్‌లా మారింది. బేబీ అనే డైలాగ్ బాగా ఫేమస్ అయింది. మేం దాన్ని చూసి బేబీ అని పెట్టలేదు. బేబీ అనే టైటిల్ ఎందుకు పెట్టామనేది ఓ సీన్‌లో వివరిస్తాం. అందరికీ ఈజీగా, క్యాచీగా ఉంటుందని బేబీ అని పెట్టాం.

నేను గడ్డం పెంచుకున్నట్టుగా కనిపించినా, అమ్మాయి అందంగా మారినట్టు కనిపించినా వాటికంటూ ఓ సందర్భం ఉంటుంది. ఆ అమ్మాయిలో ఉండే కోరికలను రిఫ్లెక్ట్ చేసేలానే ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ చూపించాం. ట్రైలర్‌లో అసలు స్టోరీని చూపించలేదు. మూడు పాత్రలను పరిచయం చేశామంతే. అసలు కథ సినిమా చూస్తే తెలుస్తుంది.

కథ చెప్పినప్పుడే కొన్ని సవాళ్లుంటాయని సాయి రాజేష్ అన్న చెప్పారు. నెరేషన్ ఇచ్చి, ట్రాక్స్ పంపించి.. కథ గురించి బాగా ఫీడింగ్ చేశారు. ప్రతీ సీన్‌, ప్రతీ ఎక్స్‌ప్రెషన్స్ గురించి వివరించి చెబుతుంటారు. బాల్ రెడ్డి, విజయ్ బుల్గానిన్ నుంచి కూడా అందుకే బెస్ట్ వర్క్ వచ్చింది.

స్కూల్ పిల్లాడిలా కనిపించేందుకు కష్టపడలేదు. కానీ డబ్బింగ్ చెప్పే టైంలోనే కష్టపడాల్సి వచ్చింది. పిల్లాడిలా అనిపించేందుకు వాయిస్‌ తగ్గించి మాట్లాడాల్సి వచ్చింది. గొంతులో ఆ అమాయకత్వాన్ని తీసుకురావాల్సి వచ్చింది.

వైష్ణవీ చైతన్య అద్భుతంగా నటించింది. తెలుగులో మంచి నటిగా ఎదుగుతుంది. సీన్లు ఎలా చేయాలో మేం ఇద్దరం చర్చించుకునేవాళ్లం. ఆమెతో నటించడాన్ని చాలా మిస్ అవుతున్నాను. ఆమెతో నటించడం ఎంతో ఎంజాయ్ చేశాను. ఇంత చిన్న వయసులో, ఇంత మంచి పాత్రను, ఇంత బాగా నటించడం అంటే మామూలు విషయం కాదు.

ఈ జానర్‌లో సినిమా చేస్తున్నా.. ఆ దర్శకుడితో చేస్తున్నాను.. అని అన్నకి చెబుతాను. కొన్ని సార్లు సినాప్సిస్ పంపిస్తాను. కానీ ఫైనల్ కాల్ మాత్రం నాదే. అది చేయమని, ఇది వద్దు అని అన్న, నాన్న ఎప్పుడూ చెప్పరు. విజయ్ దారి వేరు. నా దారి వేరు. మా ఇద్దరినీ పోల్చి చూడకూడదు.

నాకు ఇంత వరకు థియేట్రికల్ హిట్ లేదు. మా సినిమా బజ్ చూసి, ట్రైలర్ రియాక్షన్ చూసి, పాటలకు వచ్చి చూసిన రెస్పాన్స్‌తో ప్రీమియర్స్ పెట్టాం. మిడిల్ క్లాస్ మెలోడీస్ కంటే ముందే ఈ కథను విన్నాను.

విజయ్‌‌కి నేను ట్రైలర్ పంపలేదు. ఆయన చూసి ఫీల్ అయి ఆ ట్వీట్ పెట్టాడు. నాకు హిట్ రాబోతోందని గర్వంగా ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది నాకు ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ అన్నట్టుగా అనిపిస్తుందని విజయ్ అన్నాడు. మంచి సినిమా చేస్తున్నావ్.. బాగా నటిస్తున్నావ్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు.

ట్యాక్సీవాలా టైంలోనే మంచి సినిమాను తీస్తాను అని నాతో ఎస్‌కేఎన్ అన్నారు. చెప్పినట్టుగానే మంచి సినిమాను ఇచ్చారు. కంటెంట్ మీద నమ్మకంతో సినిమాను తీశారు. కంటెంట్‌ను ఎక్కువగా నమ్ముతారు. ఈ సినిమాకు క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. మేం చెప్పాలకునే పాయింట్ అక్కడే ఉంటుంది. ముందు షూటింగ్ చేసింది కూడా క్లైమాక్స్ సీనే.

కొన్నిసార్లు సినిమాకు నిడివి పనితో ఉండదు. రెండుగంటల సినిమా కూడా బోర్ కొట్టొచ్చు. మూడు గంటల సినిమా కూడా బోర్ కొట్టించకుండా ఉండొచ్చు. జనాలను ఫీల్ అయ్యేలా, కారెక్టర్లకు కనెక్ట్ అయ్యేలా తీస్తే నిడివి అనేది సమస్య కాదు. ప్రతీ పాత్రకు ఎంతో ఇంపార్టెంట్ ఉంటుంది. అందుకే కాస్త నిడివి ఎక్కువగా ఉంటుంది.

బేబీ సినిమాకు యూత్ అంతా కూడా కనెక్ట్ అవుతారు. మాస్ జనాలకు కూడా కనెక్ట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ మాస్‌కు కనెక్ట్ అవుతుంది. ఈ పాత్ర కోసం ఆటో నడపడం నేర్చుకున్నాను.

గం గం గణేశా అనే సినిమా షూటింగ్ పూర్తి కాబోతోంది. క్రైమ్ జానర్‌లో ఉంటుంది. అందులో ఫైట్లు చేశాను. స్టెప్పులు కూడా వేశాను. ఈ ఏడాది చివర్లో సినిమాను రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం.

ఇందులో ఆరు పాటలుంటాయి. నాకు ప్రతీ పాట ఇష్టమే. సురేష్ గారు రాసిన నాలుగు పాటలు, వాటి లిరిక్స్ అద్భుతంగా ఉంటాయి.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News