అమెరికాలోని డల్లాస్ నగరంలో సుస్వర మ్యూజిక్ అకాడెమీని విజయవంతంగా నిర్వహిస్తున్నారు డాక్టర్ మీనాక్షి అనిపిండి. ఈ అకాడెమీ 21వ వార్షికోత్సవం ఆదివారం (మే 5న) ఘనంగా నిర్వహించారు. గ్రాండ్ సెంటర్ ఆడిటోరియంలో జరిగిన ఈ సంబరాల్లో డల్లాస్ నగరంలోని ప్రముఖులతో సహా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అతిధులుగా పాల్గొన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక చైర్మన్ శ్రీ ప్రసాద్ తోటకూర, డల్లాస్ లో ఇండో అమెరికన్ కౌన్సిల్ సభ్యులు శ్రీ గోపాల్ పోనంగి, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కిషోర్ కంచర్ల, శ్రీమతి శారద సింగిరెడ్డి, శ్రీ ప్రకాష్ రావు అతిధులుగా హాజరయ్యారు. ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, డైరెక్టర్ వీఎన్ ఆదిత్యతో సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.
సుస్వర మ్యూజిక్ అకాడెమీ 21వ వార్షిక సంబరాల్లో మీనాక్షి అనిపిండి తన శిష్య బృందంతో 7 సిగ్మెంట్లలో దాదాపు 30కి పైగా సంప్రదాయ సంగీత కీర్తనలను ప్రదర్శన ఇచ్చారు. 10 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ సాంస్కృతిక గాన ప్రదర్శన ప్రేక్షకులందరినీ అలరించింది.ఈ వేదికపై చంద్రబోస్ కు “సుస్వర సాహిత్య కళానిధి”, ఆర్పీ పట్నాయక్ కు “సుస్వర నాదనిధి” అనే బిరుదులు అందించారు. కుమారి సంహిత అనిపిండి, శ్రీమతి ప్రత్యూష ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…