హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ సివి కుమార్ వారి కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ హిట్ ప్రాజెక్ట్‌జెడ్ తర్వాత సెకండ్ పార్ట్ కోసం మరోసారి చేతులు కలిపారు. ‘మాయవన్’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సీక్వెల్ ను ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాంబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ నేపధ్యంలో రూపొందే ఈ చిత్రాన్ని అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పిస్తోంది. కిషోర్ గరికిపాటి (జికె) ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
ఈ రోజు సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ పవర్ ప్యాక్డ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. సందీప్ కిషన్ ఒక పిడికిలిని బిగించి మరో చేతిలో సూపర్ పవర్ వెపన్ తో ఇంటెన్స్ గా చూస్తున్న ఫస్ట్ లుక్ మైండ్ బ్లోయింగ్ గా వుంది. ఈ ఎక్సయిటింగ్ ఫస్ట్ లుక్ సినిమాపై చాలా క్యూరియాసిటినీ పెంచింది.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు, సాహో ఫేమ్ నీల్ నితిన్ ముఖేష్‌ను కీలక పాత్రలో నటిస్తున్నారు. సందీప్ కిషన్ సరసన ఆకాంక్ష రంజన్ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
టాప్-క్లాస్ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో హై బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం, సూపర్‌విలన్‌తో ఒక సామాన్యుడి ఘర్షణ కథగా వుండబోతుంది. ఈ చిత్రానికి కార్తీక్ తిల్లై & కవిన్ రాజ్ డీవోపీలు గా పని చేస్తుండగా, సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
తారాగణం:సందీప్ కిషన్, ఆకాంక్ష రంజన్ కపూర్,నీల్ నితిన్ ముఖేష్, కాథరిన్ డేవిసన్ , పృధ్వీ రాజ్, బబ్లూ పృథివీరాజ్, మురళీ శర్మ, అనీష్ కురువిల్లా, మురళీధర్ గౌడ్, సత్య ప్రకాష్
టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: సివి కుమార్
నిర్మాత: రామ బ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
ప్రెజెంట్స్: అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గరికిపాటి కిషోర్
డీవోపీ: కార్తీక్ తిల్లై & కవిన్ రాజ్.
సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్
ఎడిటర్: రవి తేజ గిరిజాల
ఆర్ట్ డైరెక్టర్: ప్రేమ్ కరుంతలై.
డిజైనర్: అనంత్ కంచెర్ల (పద్మశ్రీ యాడ్స్)
పీఆర్వో: వంశీ శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…