బాబీ సింహా, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే నటీనటులుగా సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్‌పై యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రజాకార్’. ఈ సినిమా పోస్టర్‌ను శుక్రవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్, జితేందర్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, విఠల్, కె.ఎల్.నారాయణ, కె.ఎస్.రామారావు, సుద్దాల అశోక్ తేజ. బాబీ సింహా, వేదిక తదితరులు పాల్గొన్నారు.
మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ‘‘అప్పట్లో ఇక్కడ 8 జిల్లాలుండేవి. ఇక మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు అన్నీ కలిసి హైదరాబాద్ సంస్థానంలో ఉండేవి. ఇవన్నీ ఓ దేశంగా ఉండాలంటూ బ్రిటీష్ ప్రభుత్వం బలహీనమైన చట్టాన్ని విడుదల చేసిన కారణంగా నిజాం ప్రభువు స్వతంత్య్ర రాజ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతని బలంగా లక్ష, రెండు లక్షలు మంది కలిసి రజాకార్స్ సైన్యంగా ఏర్పడ్డారు. ఎన్నో అకృత్యాలు చేశారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 17 నెలల తర్వాత హైదరాబాద్‌కు స్వాతంత్య్రం వచ్చింది. అప్పుడు ప్రజలందరూ ఏకం కావటంతోనే స్వతంత్య్రం వచ్చింది. ఇస్లాంవేరు, రజాకార్లు వేరు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో ముస్లిం సోదరులు చాలా మందే ఉన్నారు. మౌలానా, తురేబాజ్ ఖాన్ వంటి ఎందరో హైదరాబాద్ స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారు. ఇలాంటి చరిత్ర భావి తరాలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చరిత్రతో చేసిన రజాకర్ సినిమాను చూసి ఎంకరేజ్ చేయాలి’’ అన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసినప్పుడు.. పాతబస్తీ ఫైల్స్ అనే సినిమా చేద్దామని నేను, నారాయణ రెడ్డన్న అనుకున్నాం. అయితే ముందు రజాకార్ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడున్న యువతకు మన చరిత్ర గురించి తెలియదు. చరిత్రను చూపెట్టటానికి చాలా మంచి ఆలోచిస్తారు. కానీ.. కొందరేమో నైజాం పాలనను స్వర్ణయుగంగా అభివర్ణిస్తారు. కానీ అది తప్పు. చరిత్రను చరిత్రగా చూపెట్టాలంటే కూడా దాన్ని ఓ మతం కోణంలో చూపెట్టాలనే ప్రయత్నం చేస్తారు. అందువల్ల కొంత మందికి ఇబ్బంది వస్తుందనే భయంతో ఆలోచిస్తారు. జరిగిన చరిత్రను మతం కోణంలో కాకుండా జరిగింది జరిగినట్లు చూపెట్టటానికి గూడూరు నారాయణరెడ్డిగారు, యాటా సత్యనారాయణగారు కలిసి రజాకార్ సినిమా చేశారు. వాళ్లు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మనకు ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం అనే సంగతి తెలిసిందే. కానీ హైదరాబాద్‌కు స్వాతంత్య్రం వచ్చింది మాత్రం సెప్టెంబర్ 17. నీచమైన నిజాం చరిత్ర గురించి ఎవరికీ తెలియదు. దాన్ని తెలియజేసే ప్రయత్నమే రజాకార్ సినిమా. ఇందులో నిజమైన చరిత్రను చూపెట్టే ప్రయత్నం చేశారు. కశ్మీర్ ఫైల్స్ గురించి ఎలాగైతే ప్రచారం చేశారో, ఇప్పుడు రజాకార్ సినిమా గురించి ప్రచారం చేయాలి. ఈ సినిమాను ఆదరిస్తేనే గూడూరు నారాయణ రెడ్డిగారు, సత్యనారాయణగారు మరిన్ని సినిమాలు చేస్తారు. ఎంటైర్ టీమ్‌కు అభినందనలు’’ అన్నారు.
సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ ‘‘రజాకార్ సినిమాను నిర్మించటానికి చాలా గట్స్ కావాలి. నా తల్లిదండ్రులు సుద్దాల హనుమంతు, జానకమ్మ.. ఇద్దరూ రజాకార్స్, నైజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం చేసినవారే. ఒకరు పెన్‌తో పోరాటం చేస్తే.. మరొకరు గన్‌తో పోరాటం చేశారు. అందుకే ఈ సినిమాలో పాటలు రాసే అవకాశం దక్కిందని నేను భావిస్తున్నాను’’ అన్నారు.
నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి మాట్లాడుతూ ‘‘నా జీవితంలో ఎన్నో విలువైన పాఠాలు నేర్పించిన వ్యక్తి విద్యాసాగర్‌రావుగారు. అలాగే నడిచే అగ్ని పర్వతంలాంటి సంజయ్‌గారు ఈ వేడుకకి రావటం ఎంతో ఆనందంగా ఉంది. సంజయ్‌గారే ఈ సినిమాకు బ్యాక్ బోన్‌లా నిలిచారు. ఆయనే కారణంగానే ఈ సినిమాను తీశాను. మా తాతగారి పేరునే నాకు పెట్టారు. ఆయన స్ఫూర్తితోనే రజాకార్ అనే సినిమాను తీశాను. నిజాం ప్రభుత్వ హయాంలో రజాకార్లు చేసిన అకృత్యాలకు అడ్డే లేదు. ఇండియన్ ఐరన్ మ్యాన్ అని మనం పిలుచుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్‌గారు ఎప్పుడైతే మిలటరీని ఇక్కడకు పంపారో అప్పుడు రజ్వీ మా గ్రామంలోకి ప్రవేశించటానికి ప్రయత్నించారు. అప్పుడు మా తాతగారు ఆయన్ని గ్రామంలోకి రానీయకుండా అడ్డుకున్నారు. రజ్వీకి, మా తాతయ్యకు మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. దాని గురించి నాకు చాలా మంది మా పెద్దవాళ్లు చెప్పారు. మన చరిత్రలో చాలా విషయాలను బయటకు తెలియనీయకుండా చేశారు. ఇప్పుడా విషయాలు గురించి నేను మాట్లాడను. తెలంగాణవాదిగా నేను నా హక్కుగా, భారతీయుడిగా భావించి రజాకార్ అనే సినిమా చేశాను. అంతే తప్ప..నేను ఎవరినీ కించపరచటానికి ఈ సినిమా చేయలేదు’’ అన్నారు.
చిత్ర దర్శకుడు యాటా సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘మహా సముద్రంలాంటి సబ్జెక్ట్‌ను సినిమాగా తీయటానికి అవకాశం ఇచ్చిన నిర్మాత నారాయణ రెడ్డిగారికి థాంక్స్. విమోచన, విముక్తి కోసం చేసిన పోరాటం స్ఫూర్తిగా చేసిన సినిమా ఇది. 800 మంది హీరోలున్న చరిత్ర ఇది. హైదరాబాద్‌కు స్వాతంత్య్రం తెచ్చిన కథ ఇది. గూడూరు నారాయణ రెడ్డిగారు ఈ సినిమా చేయటానికి ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు. నేను చూద్దాం అంటూ దాట వేసుకుంటూ వచ్చాను. కానీ ఓ రోజు ఆయన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మరో రూపమైన తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధానం నుంచి నాకు ఫోన్ చేసి సినిమా తీస్తావా.. లేదా? అని అడిగారు. నేను వెంటనే ఓకే చెప్పటమే కాదు.. టైటిల్ కూడా రిజిష్టర్ చేయించాను. ఇది మత చరిత్ర కాదు.. మదలించే చరిత్ర కాదు.. మన చరిత్ర. రజాకార్ సినిమా చూడకపోతే.. మన బ్రతుకుకి అర్థమే లేదు’’ అన్నారు.
హీరోయిన్ వేదిక మాట్లాడుతూ ‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొన్ని నెలల తర్వాత హైదరాబాద్‌కి స్వాతంత్య్రం వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయాను. అలాంటి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన రజాకార్ సినిమాను అందరూ ఆదరించాలి. గూడూరు నారాయణరెడ్డిగారు, డైరెక్టర్ సత్యనారాయణగారికి థాంక్స్. సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డారు. డైరెక్టర్‌గారికి తనకేం కావాలో క్లారిటీతో ఔట్‌పుట్ రాబట్టుకున్నారు. బాబీసింహా మంచి కోస్టార్. తను నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్. ఈ సినిమా చేయటం గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరూ రజాకార్ సినిమాను అందరూ ఆదరించాలని కోరారు.
Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had…
హైదరాబాద్:కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ దర్శకత్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ…
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…
Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ హస్పటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ రోజు…
Renowned producer Allu Aravind visited actor Sri Tej, who is currently receiving treatment at KIMS…