‘రాజు యాదవ్’కు రియల్ సక్సెస్ అందించిన ఆడియన్స్ కి కృతజ్ఞతలు : గెటప్ శ్రీను

బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘రాజు యాదవ్’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కృష్ణమాచారి దర్శకునిగా, సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా విడుదల చేశారు. మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించి థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. 

సక్సెస్ మీట్ లో హీరో గెటప్ శ్రీను మాట్లాడుతూ.. రాజు యాదవ్ సక్సెస్ మీట్ కి వచ్చేసిన అందరికీ థాంక్స్. రాజు యాదవ్ కి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా వుంది. థియేటర్స్ విజిట్ కి వెళ్ళినప్పుడు ఆడియన్స్ గుండెలు బరువెక్కాయని చెప్పడం చాలా ఎమోషనల్ గా అనిపించింది. వారి నుంచి వచ్చిన రెస్పాన్స్ రియల్ సక్సెస్ అనిపించింది. సినిమా మనసుని కదిలిస్తే అది రియల్ సక్సెస్. అలాంటి రియల్ సక్సెస్ ని అందించిన ఆడియన్స్ కి థాంక్స్. టీం తరపున ఆడియన్స్ కి శిరస్సు వంచి పాదాభివందనం చెబుతున్నాం. రాజు యాదవ్ ని ఇంత భారీ స్థాయిలో ప్రేక్షకులు వద్దకు తీసుకెళ్ళిన మా బన్నీవాస్ గారికి థాంక్స్. మ్యూజిక్ ఇచ్చిన హర్ష వర్ధన్ రామేశ్వర్, సురేష్ బొబ్బిలి, లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారికి, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అంకిత చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు. ఈ సినిమాలో నటించిన నటీనటులకి, అందరికీ థాంక్ యూ. దర్శకుడు కృష్ణమాచారి చాలా పాషన్ తో ఈ సినిమా చేశారు. ఈ సక్సెస్ ఆయకే వెళ్ళాలి. భవిష్యత్ లో ఆయన మరెన్నో మంచి చిత్రాలు చేయాలి. మమ్మల్ని బ్లెస్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి కృతజ్ఞతలు. అలాగే కొరటాల శివ గారు, పూరి జగన్నాథ్ గారు, బాబీ గారు, బ్రహ్మనంద గారు అందరికీ పేరుపేరునా మనస్పూర్తిగా కృతజ్ఞతలు. సినిమా విషయంలో నిర్మాతలు చాలా హ్యాపీగా వున్నారు. నాలుగో రోజే బ్రేక్ ఎవెన్ అవ్వడం ఆనందంగా వుంది. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులు మరోసారి ధన్యవాదాలు. రాజు యాదవ్ థియేటర్స్ లో వుంది. ఇంకా చూడని వారు తప్పకుండా వెళ్లి చూడండి.’ అని కోరారు.

డైరెక్టర్ కృష్ణమాచారి మాట్లాడుతూ.. రాజు యాదవ్ కు ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులు మనస్పూర్తిగా ధన్యవాదాలు. సినిమాకి అన్ని చోట్ల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన చాలా ఆనందాన్ని ఇస్తోంది. ప్రేక్షకులు రాజు యాదవ్ కు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. చూసిన వారంతా చాలా బావుందని అభినందిస్తున్నారు. ఈ జర్నీలో నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన శ్రీను అన్నకి థాంక్స్. అలాగే నాపై ఎంతో నమ్మకం వుంచి నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల చేసిన బన్నీవాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. సినిమా థియేటర్స్ లో వుంది. ఇంకా చూడని వారు తప్పకుండా వెళ్లి చూడండి. రాజు యాదవ్ ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది’ అన్నారు.  

హీరోయిన్ అంకిత మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ నాకు చాలా స్పెషల్. రాజు యాదవ్ కి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్స్. శ్రీను గారు చాలా సపోర్ట్ చేశారు. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మా సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’ తెలిపారు 

నిర్మాత ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజు యాదవ్ ని ఇంత అద్భుతంగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులు ధన్యవాదాలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ తెలిపారు. మూవీ టీం అంతా పాల్గొన్న ఈ సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago