డైనమిక్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ ‘మనమే’ తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి రెడీగా వున్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్‌సే స్టూడియోస్ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ‘మనమే’ జూన్ 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మూవీ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.
మనమే స్టొరీ ఐడియా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ?
-పేరెంటింగ్ ఎమోషన్ గురించి కొంచెం డిఫరెంట్ గా చెప్పాలనే ఐడియా ఎప్పటినుంచో వుంది. అది ఫన్ గా ఫుల్ ఎనర్జీతో చెప్పాలనేది నా ఉద్దేశం. అలాగే పిల్లలతో సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. అందులో తెలియని ఇన్నోసెన్స్ వుంటుంది. ఆ ఇన్నోసెన్స్ టచ్ చేయాలని అనుకున్న కథ.
బాబు పుట్టాక పెరేటింగ్ గురించి చెయ్యాలనిపించిందా?
– నేను మా పేరెంట్స్ తో చాలా ఎటాచ్ గా వుంటాను. బాబు పుట్టాక ఆ ఎటాచ్ మెంట్ ఇంకా పెరిగింది.
ట్రైలర్ లో వినిపించిన ‘ఏడిస్తే ఎవరో ఒకరే ఏడవండి’ అనే డైలాగ్ మీ పర్శనల్ ఎక్స్ పీరియన్స్ నుంచి వచ్చిందా ?
– చాలా డైలాగులు రియల్ లైఫ్ నుంచి రిలేట్ చేసుకునేలానే వుంటాయి (నవ్వుతూ).
ఈ సినిమా జర్నీలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజస్ ఏమిటి ?
-లండన్ లో అరవైమంది క్రూ తో వెళ్లి షూట్ చేయడం చాలా ఠఫ్ టాస్క్. లండన్ క్లైమెట్ కూడా అన్ ప్రిడిక్టబుల్ గా వుటుంది. ఒక లొకేషన్ అనుకుని షూట్ స్టార్ట్ చేశాక సడన్ గా వర్షం పడుతుంది. క్లైమెట్, అక్కడ లాజిస్టిక్స్ విషయంలో కొన్ని ఛాలెంజస్ ఎదుర్కొన్నాం.
శర్వానంద్ గారికి ఈ కథ చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏమిటి ?
– తనకి ‘మనమే’ కథ హోల్ నరేషన్ చెప్పాను. కథ విన్న వెంటనే ‘చేసేద్దాం పక్కా’ అన్నారు.
మీరు చాలా వరకూ క్రైమ్ థ్రిల్లర్స్ చేశారు కదా. సడన్ గా ఈ జోనర్ రావడం ఎలా అనిపిస్తోంది ?
-మనమే నా ఫేవరేట్ జోనర్. నాకు హ్యుమర్ చాలా ఇష్టం. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో మనమే నా మోస్ట్ ఫేవరేట్ ఫిల్మ్. మా అబ్బాయి యాక్ట్ చేశాడనే ఒక రీజన్ వుంది కానీ సినిమా చూసినప్పుడు మీరే అర్ధమౌతుంది. ఇందులో చైల్డ్ క్యారెక్టర్ కోసం ఫస్ట్ నుంచి విక్రమ్ ఆదిత్యనే అనుకున్నాం. తను కెమరాకి చాలా బావుంటాడనిపించింది.
ఇందులో దాదాపు 16 పాటలు వున్నాయని తెలుస్తోంది. ఇన్ని పాటలు వుండటం ఆడియన్ ఎలా ఫీలౌతారని భావిస్తున్నారు ?
-ఇందులో సాంగ్స్ సినిమా ఫ్లో కి యాడ్ అవుతాయే గానీ ఆపవు. ఇందులో ప్రతి సాంగ్ సినిమాని ఇంకా ఫాస్ట్ గా తీసుకెళుతుంది. నాకు పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమా చాలా ఇష్టం. అందులో ఆర్ఆర్ ఎక్కువగా వుంటుంది. ఎమోషన్ చక్కగా యాడ్ చేస్తుంది. మనమే కథ అనుకున్నప్పుడే విజువల్ గా ఒక కలర్ టోన్ ఫిక్స్ అయిపోయాను. ఫెయిరీ టైల్ లాంటి సినిమా చేయాలని అనుకున్నాం. అలాంటి సినిమా చేయాలంటే ముజిక్కే ఆ యాడ్ ఆన్ ఇస్తుంది. హేశం చాలా బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు.
కృతిశెట్టి మీరు అనుకున్న క్యారెక్టర్ కి యాప్ట్ అయ్యారా ?
-కృతిశెట్టి నేను అనుకున్న క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. సినిమాలో చాలా బ్రిలియంట్ గా యాక్ట్ చేసింది.
దాదాపు సినిమాని లండన్ లో షూట్ చేశారు కదా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎలాంటి సపోర్ట్ చేసింది?
-ఫెయిరీ టైల్ లాంటి కథ అనగానే లండన్ లో అలాంటి ఆర్కిటెక్చర్ వుంటుంది. అది వుంటనే ఆ మ్యాజిక్ వస్తుంది. అందుకే లండన్ వెళ్లాం. విశ్వప్రసాద్ గారు చాలా సపోర్టివ్. దాదాపు అరవై మంది క్రూతో అక్కడి వెళ్లాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు. విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు చాలా సపోర్టివ్. సినిమాకి కావాల్సిన ప్రతీదీ ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు.
ఇందులో శర్వా, కృతి వైఫ్ అండ్ హస్బెండ్ గా కనిపిస్తారా ?
-ఇది సర్ ప్రైజ్. ఇప్పుడు చెప్పకూడదు. అయితే సినిమా మొదలైన పదినిమిషాలకు ఆడియన్స్ కి తెలిసిపోతుంది. సినిమా అంతా చాలా హై వుంటుంది.
ఇందులో శర్వానంద్ గారి క్యారెక్టర్ ఎలా వుంటుంది.
– ఇందులో తనది చాలా చిల్ క్యారెక్టర్. సినిమా అంతా ఆయన క్యారెక్టర్ చాలా లైవ్లీ గా వుంటుంది. అసలు ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని శర్వాని చూపించాలని అనుకున్నాను. రన్ రాజా రన్ ఎనర్జీకి మించి వుంటుంది. సినిమా చూడండి. చాలా సర్ ప్రైజ్ అవుతారు. శర్వా చాలా ఎనర్జిటిక్ గా వుంటారు. పడిపడి లేచే మనసు సినిమా చూసినప్పుడు ఆయన ఓ చోట పవన్ కళ్యాణ్ గారిలా కనిపిస్తారు. ఆ ఎనర్జీని చూపించాలని అనుకున్నాను.
శివ కందుకూరిని తీసుకువడానికి కారణం ?
-శివ గురించి ఇప్పుడే ఎక్కువ మాట్లాడకూడదు. సినిమా చూసినప్పుడు ఆ సర్ ప్రైజ్ ని ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. నేను అనుకున్న పాత్ర కోసం గుడ్ లుకింగ్ వుండే బ్యాలెన్స్ యాక్టర్ కావాలి. ఆ పాత్రలో శివ బావుంటాడని ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది.
ఇందులో లవ్ స్టొరీ ఎలా వుండబోతుంది ?
-టామ్ అండ్ జెర్రీలా వుంటుంది( నవ్వుతూ) ఖుషిలో పవన్ కళ్యాణ్ గారు, భూమిక క్యారెక్టర్స్ మధ్య వుండే ఎనర్జీ ఇందులో వుంటుంది. ఇందులో శర్వా కృతి మధ్య వుండే రేపోని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.
ఇందులో ఇద్దరు డీవోపీలు పని చేయడానికి కారణం ?
-విష్ణు లండన్ లో షూట్ చేశారు, ఇక్కడి వచ్చాక తనకి వేరే ప్రాజెక్ట్ ఉండింది. అప్పుడు జ్ఞాన శేఖర్ గారు మిగతా పోర్షన్ షూట్ చేశారు.
అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ?
– నెక్స్ట్ ఒక ఇంట్రస్టింగ్ స్టొరీ వుంది. ఇది యాక్షన్ కామెడీ జోనర్ లో వుంటుంది.
ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…