టాలీవుడ్

‘రాజుబాబు స్మృతి ఎప్పటికీ ఉంటుంది’ దర్శకుడు బి .గోపాల్

సినిమా , టీవీ రంగాళ్లలో ప్రసిద్ధుడైన నటుడు బొడ్డు రాజబాబు స్మృతి ఎప్పటికీ ఉంటుందని , ఆయన జయంతి సందర్భంగా స్నేహితులు నిర్వహించిన స్మారక అవార్డుల కార్యక్రమమే ఇందుకు నిదర్శనమని దర్శకుడు బి .గోపాల్ చెప్పారు.


నటుడు రాజబాబు 67వ జయంతి స్మారక అవార్డుల కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో గురువారం లో జరిగింది . ఇందులో ముఖ్య అతిధిగా గోపాల్ పాల్గొన్నారు . ఏ వ్యక్తినైనా చనిపోయిన తరువాత గుర్తు పెట్టుకొని స్నేహితులు కార్యక్రమం నిర్వహించడం అపూర్వమైన విషయమని , రాజబాబు స్నేహితులు కె .వి .బ్రహ్మం , నర్రా వెంకటరావు ను ఈ సందర్భంగా అభినందిస్తున్నాని గోపాల్ తెలిపారు .


నిర్మాతల మండలి అధ్యక్షులు , ఫిలిం ఛాంబర్ కార్యదర్శి కానూరి దామోదర ప్రసాద్ మాట్లాడుతూ – గత మూడు సంవత్సరాలుగా రాజబాబు జయంతి ఉత్సవాలకు హాజరవుతున్నాని , ఇది ఎందరికో స్పూర్హిగా నిలవాలని తాను కోరుకుంటున్నాని న, సినిమా , టీవీ , నాటక రంగాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేసి వారికి రాజబాబు స్మారక అవార్డులు ఇవ్వడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు .


నటుడు , గాయకుడు , కవి గుమ్మడి గోపాల కృష్ణ మాట్లాడుతూ – రాజబాబు తో తనకు ఎంతో అనుబంధం ఉందని , ఆయన మంచి నటుడే కాదు స్నేహశీలి అని చెప్పారు . తన పేరుతో ఏర్పాటైన ట్రస్టు ద్వారా ఇచ్చే అవార్డుల్లో వచ్చే సంవత్సరం నుంచి రాజబాబు పేరుతో ఒక అవార్డును ప్రదానం చేస్తామని చెప్పారు .


దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు మాట్లాడుతూ – సినిమా రంగానికి తానె పరిచయం చేశానని , రాజబాబు జయంతి రోజు ఇలా ప్రతిభావంతులను సత్కరించడం ఎంతో తృప్తిగా ఉందని చెప్పారు .


నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .- ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్ర బాబు నాయుడు అధికారంలోకి వచ్చారని , త్వరలో నంది అవార్డుల ప్రదానం ఉంటుందని , టీవీ అవార్డుల్లో రాజబాబు స్మారక అవార్డును కూడా ప్రవేశ పెట్టడానికి తాను ప్రయత్నం చేస్తానని చెప్పారు .


రాజబాబు స్మారక అవార్డుల కమిటీ చైర్మన్ కె .వి .బ్రహ్మం మాట్లాడుతూ – రాజబాబుది విలక్షణమైన వ్యక్తిత్వం , అందరినీ ఆత్మీయంగా ప్రేమించే గొప్ప మనిషి, అలాంటి స్నేహితుణ్ని కోల్పోవడం మా అందరికీ బాధ కలిగిస్తుందని , ఆయన ఎప్పటికీ గుర్తుండేలా ఈ అవార్డులకు ప్రదానం చేస్తున్నామని , ఇది ప్రతి సంవత్సరం కొనసాగుతుందని, ఈ అవార్డుల ఎంపికలో సీనియర్ జర్నలిస్ట్ భగీరథ సహకరించారని చెప్పారు .


ఈ కార్యక్రమంలో నిర్మాత సి .వి రెడ్డి , దర్శకుడు పి .సాంబశివరావు , నటి అన్నపూర్ణమ్మ , గుమ్మడి గోపాకృష్ణ , పి వి .ఎన్ .కృష్ణ, పత్తి ఓబులయ్య , డాక్టర్ రఘునాథ బాబు , ప్రవీణ్ చంద్ర , గోపి కసిరెడ్డి , వాసు ఇంటూరి , కొర్రపాటి వెంకటేశ్వర రావు , సద్దుల మధుసూదన్ లను రాజబాబు స్మారక అవార్డులతో సత్కరించారు .
మల్లికార్జున్ కార్యక్రమాన్ని నిర్వహించారు .

Tfja Team

Recent Posts

డాక్టర్ అరుళనందు పుట్టినరోజు సందర్భంగా ‘హైకు’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన విజన్ సినిమా హౌస్

నిజాయితీతో, భావోద్వేగపూరిత కథలను ప్రోత్సహిస్తూ అందరి దృష్టిని ఆక‌ర్షిస్తూ వేగంగా ఎదుగుతోన్న‌ నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. డా.…

1 hour ago

జియో స్టార్ సరికొత్త కార్యక్రమం ‘సౌత్ బౌండ్’ టీజ‌ర్ విడుద‌ల‌

ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను మెపిస్తూ వారి హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్…

1 hour ago

లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌తో తొలి భార‌తీయ సినిమాగా గుర్తింపు పొందిన దిల్ వాలే దుల్హ‌నియా లే జాయేంగే

యష్ రాజ్ ఫిల్మ్స్ హిస్టారిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ దిల్ వాలే దుల్హ‌నియా లే జాయేంగే (DDLJ) 30 వ‌సంతాల సంద‌ర్బంగా…

1 hour ago

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

1 day ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago