విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా.మోహన్ బాబు నిర్మించిన ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
డా.మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘కన్నప్ప ఏ తరానికి అయినా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించాం. ఎంతో వ్యయప్రయాసతో నిర్మించాం. భారత దేశంలోని నాలుగు మూలల ఉన్న మహా నటుల్ని ఈ చిత్రంలో తీసుకున్నాం. శరత్ కుమార్ తీసిన పెదరాయుడు సినిమాను నేను తీశాను. ఎలాంటి పాత్రనైనా అవలీలగా శరత్ కుమార్ పోషించగలరు. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలుంటాయి. పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే ఈ సినిమా తీశాం. ముందుగా కన్నప్ప కోసం కృష్ణంరాజు గారితో మాట్లాడాం. విష్ణు కోసం కన్నప్ప తీయాలని అనుకుంటున్నానని చెబితే.. ప్రభాస్ కోసం రాసుకున్న కథను కూడా కృష్ణంరాజు గారు ఇచ్చేశారు. మేం మున్ముందు ఇంకా ఎన్నో ఈవెంట్‌లు నిర్వహిస్తాం. నిర్మాతగా నాకు మాత్రమే కాకుండా.. కన్నప్ప టీంకు ప్రజలందరి ఆశీస్సులు కావాలి’ అని అన్నారు.
విష్ణు మంచు మాట్లాడుతూ.. ‘ ‘కన్నప్ప’ను ప్రతీ ఒక్క ఆడియెన్ భుజానికి ఎత్తుకుని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అభిమానుల నుంచి వస్తున్న సపోర్ట్‌ని చూస్తూనే ఉన్నాను. అందుకే వాళ్లలోంచి కొంత మందిని ఇక్కడకు పిలిచాను. 2014లో కన్నప్ప జర్నీ ప్రారంభమైంది. 2015లో నేను కన్నప్పని డెవలప్ చేస్తూ వెళ్తుంటే.. తణికెళ్ల భరణి గారు పూర్తిగా నాకే అప్పగించారు. నా దైవం, నా తండ్రి మోహన్ బాబు గారు, విన్ని, వినయ్ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే కన్నప్పను తెరపైకి తీసుకు రాగలిగాను. టీం సెట్ కాలేదు కానీ.. లొకేషన్ల కోసం వేట ప్రారంభించాను. శివుడు పర్మిషన్ ఇస్తే తీయడానికి రెడీగా ఉండాలనే అంతా సెట్ చేసి పెట్టుకున్నాను. గత ఏడాది ఆ శివుడు పర్మిషన్ ఇచ్చారు. మేం సినిమాను తీశాం. ఆయన ఆశీస్సుల వల్లే సినిమాను తీయగలిగాం. కన్నప్ప మైథాలజీ కాదు.. కన్నప్ప మన చరిత్ర. కట్టు కథ అంటే నమ్మకండి.. రెండో శతాబ్దంలో జరిగిన కథ. చోళ రాజుల టైంలో జరిగింది. ఏడో శతాబ్దంలోనూ కన్నప్ప గురించి శంకరాచార్యులవారు చెప్పారు. 14వ శతాబ్దంలో నాయనార్ల గురించి ధూర్జటి రాశారు. అందులో 9వ నాయనార్ కన్నప్ప.18వ శతాబ్దంలో బ్రిటీష్ వాళ్లు ఇంగ్లీష్‌లో ప్రింట్ చేశారు. బికనీర్ యూనివర్సిటీలో ఆ పుస్తకం చూశాం. ఆ పుస్తకాన్ని చదివి.. ఎంతో జాగ్రత్తగా తీసి ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నాం. కన్నప్ప నా బిడ్డలాంటిది. ఈ కన్నప్ప కోసం ఇంత మంది ఆర్టిస్టులని ఎందుకు తీసుకున్నామనేది సినిమా చూస్తేనే అందరికీ అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇకపై ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఇది నా వర్షెన్‌లో రాసుకున్న ‘కన్నప్ప’. అందుకే వరల్డ్ ఆఫ్ కన్నప్ప అని అందరినీ ఆహ్వానించాం. నేను రెండో శతాబ్దం కథను చెబుతున్నాను. దానికి తగ్గట్టుగా ఉండాలనే న్యూజిలాండ్ లొకేషన్‌లో సినిమాను తీశాం. బడ్జెట్ గురించి ఆలోచించలేదు. చరిత్రలో నిలిచిపోయే సినిమా తీస్తున్నామని ముందుకు వెళ్లాం. నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్ అద్భుతంగా నటించారు. ఈ కన్నప్ప మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. హర హర మహదేవ్’ అని అన్నారు.
ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ‘కన్నప్ప సినిమాలో నాకు నా ఆర్టిస్టులే బలం. విష్ణు చేసిన యాక్టింగ్, పడిన కష్టం గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. గడ్డ కట్ట చలిలోనూ టీం అంతా చలించకుండా పని చేసింది. విష్ణు గారు, శరత్ కుమార్ గారు, మోహన్ బాబు గారు అంత డెడికేటెడ్‌గా పని చేశారు. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. నా అంచనాలని మించి నటించారు. రామాయణం, మహాభారతం మైథాలజీ కాదు.. అది మన చరిత్ర. సౌత్, నార్త్ అని ఉండదు. ఓ భక్తుడి కథను చెప్పాం. మనం దేవుడి దగ్గరకు వెళ్లి కోరికలు కోరుతాం. కానీ ఏం కోరకుండా దేవుడికే నేత్రాలను సమర్పించారు కన్నప్ప. అలాంటి గొప్ప భక్తుడి కథను చెప్పాం. అంతకంటే గొప్ప కథ ఇంకెక్కడ దొరుకుతుంది’ అని అన్నారు.
శరత్ కుమార్ మాట్లాడుతూ.. ‘కన్నప్ప కేవలం సినిమా కాదు.. మన చరిత్ర. ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించారు. ఇంకా ఇప్పటికీ ఆ పాత్రల్లోనే ఉండిపోయాం. చరిత్రను అందరూ మర్చిపోతున్నారు. మనం మన చరిత్రను చెప్పుకోవాలి. కన్నప్పను అందరూ వీక్షించాలి’ అని అన్నారు.
మధుబాల మాట్లాడుతూ.. ‘కన్నప్ప లాంటి ప్రాజెక్ట్‌లో నటించడం ఆనందంగా, గర్వంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మోహన్ బాబు గారికి, విష్ణు గారికి థాంక్స్. విష్ణు మంచు గారికి మేకింగ్‌లో ఎంతో నాలెడ్జ్ ఉంది. విష్ణు లాంటి వారే ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌ని తీయగలరు. ఓ మహాయజ్ఞంలో పాల్గొన్నట్టుగా అనిపించింది’ అని అన్నారు.
ప్రీతి ముకుందన్ మాట్లాడుతూ.. ‘కన్నప్పలో నాకు ఛాన్స్ ఇచ్చిన మోహన్ బాబు గారికి, విష్ణు గారికి, ముఖేష్ సింగ్ గారికి థాంక్స్. ఈ సినిమాకు అందరూ ప్రాణం పెట్టి నటించారు. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు.
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…
తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…