ఇంకా “గగన” విహారంచేస్తున్నట్లుగానే ఉంది!!

“డాకు మహారాజ్”లో పోషించిన
పాయల్ పాత్రకు దండిగా ప్రశంసలు
అందుకుంటున్న చైల్డ్ ఆర్టిస్ట్ గగన గీతిక

“డాకు మహారాజ్ లో నటించే అవకాశం రావడమే ఒక గొప్ప అవకాశం అనుకుంటే… ఆ చిత్రంలో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయన ప్రశంసలు అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని” అంటోంది బాలనటి గగన గీతిక. “పిట్ట కొంచెం… కూత ఘనం” ఆనే సామెతను గుర్తు చేస్తూ… నాలుగున్నరేళ్ల ప్రాయంలోనే టిక్ టాక్ వీడియోస్ చేస్తూ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించి… “లాయర్ విశ్వనాధ్” చిత్రంతో బాలనటిగా అరంగేట్రం చేసిన ఈ చిచ్చరపిడుగు..రెండవ మూవీ . “ఆర్.ఆర్.ఆర్, నారప్ప,18 పేజీస్, తెల్లవారితే గురువారం” తదితర చిత్రాలలో హీరోయిన్ల చిన్నప్పటి పాత్రలతో తన ప్రతిభకు మరింత సానబెట్టుకుంది!!

“90’s మిడిల్ క్లాస్ బయోపిక్, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్, ప్రేమ విమానం” చిత్రాలలోనూ నటించి మెప్పించిన గగన.. ప్రస్తుతం “ఓదెల రైల్వే స్టేషన్-2” చిత్రంలో తమన్న చిన్నప్పటి క్యారెక్టర్ చేస్తోంది. సినిమాలు చేస్తూనే చదువును నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న “గగన”కు ప్రేరణ తన తండ్రి శ్రీతేజ. సినిమా రంగంపై ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చిన శ్రీతేజ… కుటుంబానికి అండగా ఉంటూనే… సినిమారంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం యానిమేషన్ రంగాన్ని ఎంచుకుని… నటుడిగా తను కూడా తనకంటూ చిన్న ప్రత్యేకత సంపాదించుకునే దిశగా ముందుకు సాగుతున్నాడు. “హైదరాబాద్ డ్రీమ్స్” మూవీ లో లీడ్ రోల్ చేసి.. పలు మూవీస్ లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ తో మెప్పించిన శ్రీతేజ్.. “కృష్ణతులసి, ఎద లోయలో ఇంద్రధనస్సు” వంటి ధారావాహికలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు!!

ఒకవైపు సంప్రదాయబద్ధంగా కూచిపూడి నేర్చుకుంటూనే… మరోవైపు వెస్ట్రన్ డాన్స్ కూడా సాధన చేస్తున్న గగన… తను నటించిన “డాకు మహారాజ్”… గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడం, అందులో తను చేసిన పాయల్ అనే పాత్ర… కథను కీలక మలుపు తిప్పేది కావడం పట్ల పట్టరాని సంతోషం వ్యక్తం చేస్తోంది. తనపై ఎంతో వాత్సల్యం చూపించి, తనతో కాంబినేషన్స్ సీన్స్ లోనూ బెరుకు లేకుండా నటించేలా ప్రోత్సహించిన బాలయ్యకు, ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు బాబీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతున్న గగన… భవిష్యత్తులో మంచి పెర్ఫార్మర్ గా పేరు గడించాలని ఆశీర్వదిద్దాం!!

Tfja Team

Recent Posts

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

23 hours ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

23 hours ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

23 hours ago

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో…

2 days ago

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో‘అగధ’

ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…

2 days ago

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి -ఎం.వెంకయ్య నాయుడు

అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…

2 days ago