Vamsi

మెగాస్టార్ చిరంజీవి, యువి 157 అనౌన్స్ మెంట్

మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ - మెగా మాస్ బియాండ్ యూనివర్స్ - మెగా157 అనౌన్స్ మెంట్ ఇది మీ ఊహకు మించి ఉంటుంది. తెలుగు…

1 year ago

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ట్రైలర్ రిలీజ్

https://youtu.be/HcAjTg8fpOM అభిమానులు, మీడియా ప్రతినిధులే ముఖ్య అతిథులుగా న‌వీన్ పొలిశెట్టి, అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్ యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి,…

1 year ago

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్

ఈ నెల 21న న‌వీన్ పొలిశెట్టి, అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్ యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క…

1 year ago

మాస్ మహారాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ”టైగర్ నాగేశ్వరరావు”

వెంకటేష్, జాన్ అబ్రహం, శివ రాజ్ కుమార్, కార్తీ, దుల్కర్ సల్మాన్ లాంచ్ చేయనున్న మాస్ మహారాజా రవితేజ, వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పాన్ ఇండియన్…

2 years ago

Ajay-Atul along with 30+ Chorus Singers To Perform Live

Ajay-Atul along with 30+ Chorus Singers To Perform Live Orchestra On Jai Shri Ram From Adipurush As we head closer…

2 years ago

Countdown Begins! Adipurush Unravels in 1 Month

Om Raut directed and Bhushan Kumar produced Adipurush has left quite a strong footprint on the minds of the audience.…

2 years ago

<strong><br>మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల</strong>

Miss Shetty Mr Polishetty is a comedy entertainer featuring Naveen Polishetty and Anushka Shetty The promotions have started with the…

2 years ago

‘మట్టి కుస్తీ’ లో ఫ్యామిలీ, లవ్, ఎంటర్టైన్మెంట్ – మాస్ మహారాజా రవితేజ

హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా 'మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మికథానాయికగా నటిస్తోంది.'ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌ లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ఈ నేపధ్యంలో 'మట్టి కుస్తీ' ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. రవితేజ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దర్శకులు సుధీర్ వర్మ, వంశీ, జ్వాలా గుత్తా  తదితరులు వేడుకలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో రవితేజ, విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జ్వాలా గుత్తా చిత్రంలోని చల్ చక్కని చిలక పాటకు వేదికపై డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని ఆకట్టుకుంది. అనంతరం మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ..'మట్టి కుస్తీ'కి పని చేసిన సాంకేతిక నిపుణులందరికీ థాంక్స్. ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన జస్టిన్ ప్రభాకరన్ సౌండ్ అంటే నాకు చాలా ఇష్టం. తనతో సినిమా కూడా చేయాలని విష్ణుతో చెప్పాను. రిచర్డ్స్ వండర్ ఫుల్  కెమరామెన్. దర్శకుడు చెల్లా అయ్యావు కథ చెప్పినపుడు చాలా ఎంజాయ్ చేశాను. తన సెన్స్ ఆఫ్ హ్యుమర్ బావుంటుంది. తనతో ఓ సినిమా మాత్రం చేయాలి. అందం, ప్రతిభ కలిపితే ఐశ్వర్య లక్ష్మీ. ఇందులో ఆమె పాత్రని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. విశాల్, ఐశ్వర్య కెమిస్ట్రీ స్టన్నింగా వుంటుంది. ఇది కేవలం స్పోర్ట్స్ ఫిల్మ్ మాత్రమే కాదు. ఎమోషన్, ఫ్యామిలీ, లవ్, ఎంటర్ టైన్ మెంట్ అన్నీ వున్నాయి. ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ ఈ రెండు టీములు సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాయి. ఈ వేడుకకు ముఖ్య అతిధులు అభిమానులే. హీరోగా ఎంతో సపోర్ట్ చేశారు. నిర్మాతగా కూడా సపోర్ట్ చేసేయండి. విష్ణు విశాల్ పాజిటివ్ పర్శన్. ఫస్ట్ మీటింగ్ లోనే విశాల్ నాకు ఎప్పటి నుండో తెలుసనే ఫీలింగ్ కలిగింది. అన్నీ సింగిల్ సిట్టింగ్ లోనే మొదలైపోయాయి. సినిమా చాలా బావొచ్చింది. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. డిసెంబర్ 2న థియేటర్లో కలుద్దాం'' అన్నారు విష్ణు విశాల్ మాట్లాడుతూ.. 'మట్టి కుస్తీ' డిసెంబర్ 2 థియేటర్లో గ్రాండ్ రిలీజ్ అవుతుంది. చాలా ఆనందంగా వుంది.  రవితేజ గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయనది చాలా మంచి మనసు. ఒక్క మీటింగ్ లోనే నాపై పూర్తి నమ్మకం ఉంచారు. జ్వాలా నన్ను తెలుగు సినిమాలు చేయాలనీ చెప్పేది. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ని ప్రేమిస్తారు. రవితేజ గారి లాంటి గొప్ప వ్యక్తి సపోర్ట్ తో మీ ముందుకు వస్తున్నాను. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఆడ మగ సమానమనే సందేశాన్ని చాటే సినిమా ఇది. మహిళా ప్రేక్షకులు సినిమాని చాలా ఇష్టపడతారు. డిసెంబర్ 2న అందరూ థియేటర్ కి వెళ్లి 'మట్టి కుస్తీ' చూడాలి'' అని కోరారు. ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ..  'మట్టి కుస్తీ'చక్కని సినిమాని నిర్మించిన రవితేజ గారు, విష్ణు విశాల్ గారికి కృతజ్ఞతలు. డిసెంబర్ 2న మీ ఫ్యామిలీ అందరికీతో కలసి థియేటర్లో 'మట్టి కుస్తీ' ని చూసి ఎంజాయ్ చేయండి'' అని కోరారు దర్శకుడు చెల్లా అయ్యావు మాట్లాడుతూ.. రవితేజ గారు 'మట్టి కుస్తీ' ని నిర్మించడం చాలా ఎక్సయిటింగా వుంది. రవితేజ గారి కి తమిళనాడులో కూడా భారీ ఎత్తున అభిమానులు వున్నారు. క్రాక్ సినిమా హౌస్ ఫుల్ గా రన్ అయ్యింది. ఆ సినిమాని చాలా మంది రీమేక్ చేయాలని భావించారు.  అయితే రవితేజ గారు బాడీ లాంగ్వేజ్, స్టయిల్ రిప్లేస్ చేయడం చాలా కష్టం. రవితేజ గారు త్వరగా తమిళ్ లో సినిమా చేయాలి. విష్ణు విశాల్, ఐశ్వర్య అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశారు. ఫ్యామిలీ తో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న చిత్రమిది. డిసెంబర్ 2న అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి'' అని కోరారు.  జ్వాలా గుత్తా మాట్లాడుతూ.. విష్ణుని తెలుగులో రమ్మని మూడేళ్ళుగా అగుడుతున్నాను. తన చిత్రాల కంటెంట్ బావుటుంది. రవితేజ గారికి ని నేను పెద్ద అభిమానిని. విశాల్ పై రవితేజ గారు మొదటి మీటింగ్ లోనే ఎంతో నమ్మకం ఉంచారు. ఇది చాలా గ్రేట్. 'మట్టి కుస్తీ' కోసం  అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. అవుట్ పుట్ పై చాలా హ్యాపీగా వున్నాం. టీం అందరికీ గుడ్ లక్'' తెలిపారు సుధీర్ వర్మ మాట్లాడుతూ.. 'మట్టి కుస్తీ'' సినిమా గురించి నాకు తెలుసు. ఈ సినిమా ఖచ్చితంగా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. 'ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్, టీం అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు వంశీ మాట్లాడుతూ .. 'మట్టి కుస్తీ'' ట్రైలర్ ప్రామెసింగా వుంది. విష్ణు విశాల్ గారు మంచి కంటెంట్ వున్న సినిమాలు చేస్తుంటారు. రవితేజ గారు ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యారంటే ఖచ్చితంగా సినిమా ప్రత్యేకంగా వుంటుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' తెలిపారు. అజయ్ మాట్లాడుతూ.. 'మట్టి కుస్తీ'లో నెగిటివ్ రోల్ లో కనిపిస్తా, కథ చాలా ఆసక్తికరంగా వుంటుంది. రవితేజ గారు నిర్మించారు మరింత ఎక్సయిటింగా అనిపించింది. విష్ణు విశాల్ విలక్షణమైన కథలు ఎంచుకొని విజయాలు సాధిస్తుంటారు. 'మట్టి కుస్తీ'కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది'' అన్నారు.…

2 years ago