ఈ నెల 21న నవీన్ పొలిశెట్టి, అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్
యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందుతోన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతోంది.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నట్లు శనివారం చిత్రబృందం ప్రకటించారు.
అనౌన్స్ మెంట్ నుంచి అందరిలో ఆసక్తి కలిగించింది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా. ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ మూవీగా ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను థియేటర్ లో ఎంజాయ్ చేసేందుకు ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.
నటీనటులు: నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్: యువీ క్రియేషన్స్
నిర్మాతలు: వంశీ – ప్రమోద్
రచన, దర్శకత్వం: మహేష్ బాబు.పి
సంగీతం : రధన్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ: నిరవ్ షా
కొరియోగ్రఫీ: రాజు సుందరం, బృందా
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్
వి.ఎఫ్.ఎక్స్ సూపర్ వైజర్: రాఘవ్ తమ్మారెడ్డి
పి.ఆర్.వో : జీ.ఎస్.కే మీడియా
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…