అభిమానులు, మీడియా ప్రతినిధులే ముఖ్య అతిథులుగా నవీన్ పొలిశెట్టి, అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్
యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి అభిమానులు, ఆడియెన్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆడియెన్స్ నుంచి నుంచి సుబ్బు, చరణ్, తులసి, శృతి, మీడియా ఫ్రెండ్స్ నుంచి ఐడియల్ బ్రెయిన్ జీవి చేతుల మీదుగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా
దర్శకుడు పి.మహేశ్ బాబు మాట్లాడుతూ – మా సినిమా ట్రైలర్ నచ్చిందని ఆశిస్తున్నాను. ఒక కొత్త కాంబినేషన్ లో నవీన్, అనుష్క, యూవీ క్రియేషన్స్, నేను కలిసి సినిమా చేశామంటే అందుకు ఇన్ స్పైర్ చేసింది కథే. రెండున్నర నిమిషాల ట్రైలర్ లో మేము కొంతే ఎంటర్ టైన్ చేయగలిగాం. రేపు థియేటర్ లో పూర్తి సినిమా చూస్తున్నప్పుడు కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తారు. కథ ఓకే అయ్యాక అనుష్క గారికి ఇలాంటి సబ్జెక్ట్, క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది అనిపించింది. అదే టైమ్ లో తను కూడా ఇలాంటి ఒక వెరైటీ మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. సో నేను కథ చెప్పగానే ఆమెకు బాగా నచ్చింది.
నవీన్ హీరో అని చెప్పినప్పుడు అనుష్క గారు రైట్ ఛాయిస్ అని చెప్పారు. వీళ్లిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ వల్లే మూవీ ఇంత మ్యాజికల్ గా వచ్చింది. ఇదొక ఎంటర్ టైనింగ్ మూవీ మాత్రమే కాదు. ఒక ఎమోషన్ ఉంటుంది. ఇవాళ్టి యూత్.. రిలేషన్స్ ను చూస్తున్న దృష్టి కోణం ఉంటుంది. పెళ్లి ఒక్కటే కాదు వాళ్లు ఏర్పర్చుకునే ప్రతి రిలేషన్ లో యువత ఆలోచించే తీరు ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాం. ట్రైలర్ లో మీరు చూసిన పాయింట్ తోనే సినిమా ఉండదు.
మిమ్మల్ని ట్రైలర్ తో మిస్ గైడ్ చేస్తున్నాం. సినిమాలో మరో యూనిక్ పాయింట్ ఉంటుంది. అదేంటో సినిమాలో చూడాలి. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వెరీ క్లీన్ ఫిల్మ్. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సెప్టెంబర్ 7న థియేటర్స్ లో కలుద్దాం. అని అన్నారు.
నటుడు మహేశ్ ఆచంట మాట్లాడుతూ – జాతి రత్నాలు సినిమాలో అన్నతో కలిసి నటించాను. ఆ సినిమాకు నాకు మంచి పేరొచ్చింది. డైరెక్టర్ మహేశ్ అన్న నాకు రా..రా కృష్ణయ్య టైమ్ నుంచి తెలుసు. పదేళ్లుగా ఆయనను కలుస్తూనే ఉన్నాను. ఈ సినిమాలో నవీన్ అన్న ఎనర్జీ సర్ ప్రైజ్ చేస్తుంది. అనుష్క గారి సైజ్ జీరో సినిమాలో చిన్న రోల్ చేశాను. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ దొరికింది. నవీన్ అన్న జాతి రత్నాలతో 70 కోట్ల వసూళు మూవీ చేశాడు. ఈ సినిమాతో 100 క్రోర్ కలెక్షన్ చేయాలని కోరుకుంటున్నా. దర్శకుడిగా మహేశ్ అన్నకు పేరు రావాలి. అలాగే యూవీ సంస్థకు ఈ సినిమాతో మరో హిట్ రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ – హ్యూమన్ రిలేషన్స్ మీద మంచి ఎంటర్ టైనింగ్ స్టోరీ రాసుకున్నాడు మహేశ్. జాతి రత్నాలు హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే ఒత్తిడికి గురయ్యాను. ఫైర్ యాక్సిడెంట్ లో గాయాలైన ఒక మహిళా అభిమాని డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు నా జాతి రత్నాలు సినిమా రోజూ చూస్తానని చెప్పింది. ఇంతకంటే ఓ నటుడిగా నాకేం కావాలి. ఎన్ని బాక్సాఫీస్ హిట్స్ వచ్చినా, ఎన్ని రికార్డులు సాధించినా ఇంత కంటే సంతృప్తి నటుడిగా నాకు దొరకదు. అలా ఆ సినిమాతో మీరు నాపై చూపించిన అభిమానం ఎంతో కదిలించింది. మిమ్మల్ని ఎలా ఎంటర్ టైన్ చేయాలి.
ఇంకా ఎలాంటి కొత్త సబ్జెక్ట్ తీసుకోవాలి అని ఆలోచించాను. కొత్త తరహా సినిమాలు ఇష్టపడే మీకు ది బెస్ట్ మూవీ ఇవ్వాలని చాలా కథలు విన్నాను. ఆ క్రమంలో మహేశ్ చెప్పిన ఈ స్టోరి చాలా ఎగ్జైట్ చేసింది. ఇలాంటి సబ్జెక్ట్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే తప్పకుండా నచ్చుతుందనే ధైర్యం కలిగింది. స్టాండప్ కామెడీ క్యారెక్టర్ తో ఫుల్ లెంగ్త్ సినిమా తెలుగులో రాలేదు. నిజంగానే స్టాండప్ కామెడీ షోస్ కండెక్ట్ చేసి రియల్ ఆడియెన్స్ తో మా సినిమాలో సీన్స్ షూట్ చేశాం. నేను కూడా మరే సినిమా ఒప్పుకోకుండా పూర్తిగా ఈ మూవీ మీదే దృష్టి పెట్టా.
రొమాంటిక్ కామెడీ మూవీస్ తో పోల్చితే మా సినిమాలో ఒక యూనిక్ పాయింట్ ఉంది. అనుష్క హీరోయిన్ అనగానే హ్యాపీగా ఫీలయ్యా. ఆమెతో నా కాంబినేషన్ బాగుంది. మా మధ్య టైమింగ్ కుదిరేందుకు ఒకట్రెండు రోజులు పట్టింది. ఆ తర్వాత చాలా ఎంజాయ్ చేస్తూ సినిమాలో నటించాం. ట్రైలర్ లో మీరు చూసింది తక్కువే. సినిమాలో అనుష్క చేసే రచ్చను చూస్తారు.
హీరో హీరోయిన్ల క్యారెక్టర్స్ కెమిస్ట్రీ మీద రన్ అయ్యే సినిమా ఇది. గత రెండేళ్లు ఈ ప్రాజెక్ట్ మీదే మేమంతా పనిచేశాం. సినిమాను అంతగా నమ్మాం. ఒక కథను మీ ముందుకు తీసుకువద్దామని నమ్మకంతో పనిచేశాం.
సెప్టెంబర్ 7న థియేటర్స్ లోకి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వస్తోంది. చూసి ఎంజాయ్ చేయండి. యాక్షన్ మూవీస్ చేసేందుకు కూడా నేను సిద్ధమే. అయితే ప్రేక్షకులు నన్ను వైవిధ్యమైన కథల్లో ఆదరించినంత కాలం అన్ని జానర్స్ మూవీస్ చేస్తూనే ఉంటా. ప్రభాస్ అన్నకు మా మూవీ ట్రైలర్ నచ్చింది. ప్రభాస్ అన్నకు థాంక్స్. అన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…