పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాసీవ్ షెడ్యూల్ సెప్టెంబర్ 5న ప్రారంభం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దర్శకుడు హరీష్ శంకర్ తొలిసారి కలిసి ఇండస్ట్రీలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటైన ‘గబ్బర్ సింగ్’ ను అందించారు. ఈ బ్లాక్‌బస్టర్ కాంబో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మరో స్పెషల్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో అలరించబోతుంది.
ఈ సినిమా మాసీవ్ షెడ్యూల్ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ లెంతీ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, అతని టీం భారీ సెట్‌ను నిర్మించారు.
ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరస్తున్నారు. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, అశుతోష్ రానా, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ
సాంకేతిక విభాగం:
రచన & దర్శకత్వం : హరీష్ శంకర్.ఎస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవి శంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
స్క్రీన్ ప్లే: కె దశరధ్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: అయనంక బోస్
ఎడిటర్: చోటా కె ప్రసాద్
అడిషినల్ రైటర్: సి. చంద్రమోహన్
ప్రొడక్షన్ డిజైనర్: ఆనంద్ సాయి
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: చంద్రశేఖర్ రావిపాటి, హరీష్ పై
సిఈవో: చెర్రీ
పీఅర్వో: వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…