వెంకటేష్, జాన్ అబ్రహం, శివ రాజ్ కుమార్, కార్తీ, దుల్కర్ సల్మాన్ లాంచ్ చేయనున్న మాస్ మహారాజా రవితేజ, వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పాన్ ఇండియన్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి రెండు బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మే 24న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కానుంది.
ఐదు భాషలకు చెందిన ఐదుగురు సూపర్ స్టార్లు ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. తెలుగు వెర్షన్‌కి సంబంధించిన పోస్టర్‌ను వెంకటేష్ విడుదల చేయనుండగా, జాన్ అబ్రహం, శివ రాజ్‌కుమార్, కార్తీ, దుల్కర్ సల్మాన్‌లు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నారు.
రవితేజ మునుపెన్నడూ చూడని విధంగా మాస్, రగ్డ్ లుక్‌లో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ ఫెరోషియస్, స్ట్రైకింగా ఉండబోతుంది.
టైగర్ నాగేశ్వరరావు1970ల నేపథ్యంలో స్టూవర్టుపురంలోని గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. ఈ పవర్ ఫుల్ పాత్ర పోషించేందుకు రవితేజ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్, యాసతో ఆకట్టుకుంటారు. ఈ సినిమాలో రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఆర్ మదీ ISC సినిమాటోగ్రాఫర్ కాగ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.
ఈ చిత్రం అక్టోబర్ 20 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అవుతుంది.
నటీనటులు: రవితేజ, నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ తదితరులు
రచన, దర్శకత్వం: వంశీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్
సహ నిర్మాత: మయాంక్ సింఘానియా
డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: ఆర్ మదీ
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
పీఆర్వో: వంశీ-శేఖర్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…