–యునానిమస్ టాక్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్: డైరెక్టర్ శివ నిర్వాణ
-‘మత్తువదలరా2’ విజువల్ గ్రామర్, కామెడీ ఉన్న బ్యుటీఫుల్ మూవీ. చాలా ఎంజాయ్ చేశాను: డైరెక్టర్ వివేక్ ఆత్రేయ
-థియేటర్స్ లో ప్రేక్షకులు నవ్వులు చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ‘మత్తువదలరా2’ని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కి థాంక్ యూ: సక్సెస్ మీట్ లో హీరో శ్రీ సింహ &టీం
శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్ లో రితేష్ రానా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిలేరియర్స్ థ్రిల్లర్ ‘మత్తువదలరా2’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 13న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షుకులని అలరించిన హిలేరియస్ బ్లాక్ బస్టర్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ ని నిర్వహించారు. స్టార్ డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ, అనుదీప్, మహేష్ బాబు హాజరైన ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది.
సక్సెస్ మీట్ లో హీరో శ్రీసింహ మాట్లాడుతూ.. ప్రేక్షకులు సినిమాని చూసి హార్ట్ ఫుల్ గా నవ్వుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మత్తువదలరా వరల్డ్ లో నాకు బాబు లాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ రితిష్ కి థాంక్ యూ. ఇంత అద్భుతమైన టీంలోకి నన్ను ఇంక్లూడ్ చేసిన నిర్మాతలు నవీన్ గారు, రవి గారు, చెర్రి గారికి థాంక్ యూ. సత్యతో వర్క్ చేయడం వెరీవెరీ హ్యాపీ. ‘మత్తువదలరా2’ని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కి థాంక్ యూ’ అన్నారు.
డైరెక్టర్ రితేష్ రానా మాట్లాడడుతూ.. మా నిర్మాత చెర్రి గారు హ్యాపీగా వున్నారు. మా టీం అంతా హ్యాపీగా వున్నారు. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నా డైరెక్షన్ టీం కి థాంక్ యూ. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. ఈ సినిమా చేసిన సింహకి థాంక్ యూ. ఒక స్టార్ తో వర్క్ చేయాలని వుండేది. సత్యతో వర్క్ చేయడంతో ఆ కోరిక తీరిపోయింది. నెక్స్ట్ మూవీ కూడా తనతో చేసే భాగ్యం దొరకాలని కోరుకుంటున్నాను.(నవ్వుతూ). అందరూ మూవీ చూసి ఎంజాయ్ చేయండి’ అన్నారు.
యాక్టర్ సత్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముందుగా ఆడియన్స్ కి థాంక్యూ. ఈ సినిమాకి చెర్రీ గారు అడిగినదానికంటే ఎక్కువ ఇచ్చారు. మా బాయ్స్ అందరినీ నమ్మినందుకు చెర్రీ గారికి థాంక్యూ. వెన్నెల కిషోర్ అన్న, అజయ్ అన్న అందరూ చాలా సపోర్ట్ చేశారు. సునీల్ అన్న యాక్టింగ్ చూసే ఇన్స్పైర్ అయ్యాను. ఆయన కూడా చాలా మంచి అడ్వైజ్లు ఇచ్చారు. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. పేరుతో పాటు సక్సెస్ వచ్చింది. ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది. ఆడియన్స్ అందరూ చాలా బాగా చేశానని అభినందిస్తున్నారు. అందరికీ థాంక్యు. సింహ ఫస్ట్ పార్ట్ కి ఇప్పటికీ చాలా పరిణితి చెందాడు( నవ్వుతూ). మేము బయట కూడా ఫ్రెండ్స్ లానే ఉంటాం. ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న ఆడియన్స్ అందరికీ థాంక్యూ.
నిర్మాత చెర్రీ మాట్లాడుతూ.. ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసిన ఆడియన్స్అందరికీ ధన్యవాదాలు. ఈ సక్సెస్ కి కారణమైన సినిమా యూనిట్ అందరికీ కూడా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా బాగుందని మెసేజ్ పెట్టడంతో పాటు టికెట్లు దొరకట్లేదని మెసేజ్లు రావడం కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. పెద్ద హీరోలు సినిమాలకి టికెట్లు దొరకలేదని వింటుంటాం. ఒక పెద్ద సినిమాలానే ఈ సినిమా కూడా అలాంటి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. మల్టీప్లెక్స్ లోను సింగిల్స్ స్క్రీన్స్ లోను సినిమా అద్భుతంగా ఆడుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేక్షకుల నవ్వులు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. రితీష్ రానా చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు తనకి ఎంత కావాలో అంతే షూట్ చేస్తాడు. అలాంటి క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్ దొరకడం చాలా రేర్. కాలభైరవ తన మ్యూజిక్ తో సినిమాని ఎలివేట్ చేశాడు. ఒక విజువల్ ఫీస్ట్ లా ఈ సినిమాని తీశాడు డీవోపీ. ఆ డైరెక్టర్ కూడా బ్యూటిఫుల్ గా వర్క్ చేశారు. సత్య సింహా కాంబినేషన్ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఒకరిని ఒకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఫారియా అబ్దుల్లాతో పాటు మిగతా ఆర్టిస్టులు అందరూ చాలా అద్భుతంగా పెర్ఫాం చేశారు. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి మరోసారి ధన్యవాదాలు’ తెలిపారు
డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. జాతిరత్నాల తర్వాత అంత మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా ఇదే అనుకుంటున్నాను. ఆడియన్స్ హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి సీన్ ని ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమా అవకాశం ఇచ్చిన నవీన్ గారికి రవి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సినిమా వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. ప్రతి షోకి రెస్పాన్స్ త్రీ టైమ్స్ పెరుగుతుంది. షోస్ కూడా ఇంక్రీజ్ చేశాం. సత్య గారు సింహ గారు అద్భుతమైన కెమిస్ట్రీ తో ఈ సినిమా చేశారు. కాలభైరవ గారు ఎక్స్ట్రార్డినరీగా మ్యూజిక్ చేశారు. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ఆడియోస్ కి ధన్యవాదాలు.
మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ మాట్లాడుతూ.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. మా టీమ్ అంతా ఒక కుటుంబం లాగా. బిజిఎం కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మా టీమ్ అందరికీ థాంక్యు. ఈ క్రెడిట్ అంతా నా టీం కి ఇస్తున్నాను.
యాక్టర్ రాజా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత చెర్రీ గారికి థాంక్యూ. రితేష్ తో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. తను చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. సింహ సత్య కెమిస్ట్రీ అదిరిపోయింది. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్యూ.
డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. టీమ్ అందరికీ కంగ్రాట్యులేషన్స్ అండ్ బిగ్ థ్యాంక్స్. థాంక్స్ ఎందుకంటే.. గత 10 డేస్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలతో కూడిన డిప్రెషన్ లో ఉన్నాం. ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చే ఫిలిం ఇది. 100% ఇది ఒక మంచి రిలీఫ్. సత్య శ్రీ సింహ థాంక్యూ వెరీ మచ్. జనాలు అందరిలోనూ ఒక మంచి నవ్వును తీసుకువచ్చారు. అందరికీ థాంక్స్ చెప్తున్నాను. ఒక రెండున్నర గంటలసేపు నవ్విస్తూనే ఉన్నారు. అందరికీ హాట్ ఫుల్ గా కంగ్రాచ్యులేషన్స్. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారికి రవి గారికి, బ్లాక్ బస్టర్ అందుకున్న టీం అందరికీ కంగ్రాట్స్. రెండున్నర గంటలసేపు అన్ని మర్చిపోయి హాయిగా చూడదగ్గ సినిమా ఇది. పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తున్నా’ అన్నారు
డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ ..యునానిమస్ టాక్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్. సినిమా చాలా గ్రిప్ంగా ఉంది చాలా ఎంటర్టైనింగ్ గా ఫీల్ అయ్యాను. సినిమాలో కామెడీ తో పాటు బ్యూటిఫుల్ విజువల్ కొరియోగ్రఫీ ఉంది, మంచి మ్యూజిక్ ఉంది, చాలా అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. కాలభైరవ ఈ సినిమాకి మూడో హీరో అని చెప్తాను. అద్భుతంగా చేశారు. సాలిడ్ గా రాశారు. నెక్స్ట్ తన నుంచి ఎలాంటి కథలు వస్తాయనే ఆసక్తి ఉంది. సత్య చేస్తున్న కామెడీకి సింహ కాంప్లిమెంట్ చేయడం అద్భుతంగా అనిపించింది. సింహం చాలా రిలేటబుల్ గా ఉన్నాడు. వీరిద్దరూ ఈ బాండింగ్ తో సినిమాలు చేస్తూనే ఉండాలి. టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్. మంచి రిలీఫ్ సినిమా ఇది. . అందరూ ఎంజాయ్ చేయండి’ అనంరు
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. రితేష్ వర్క్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. విజువల్ గ్రామర్ విజువల్ కామెడీ ఉన్న డైరెక్టర్ తను. తన సినిమాలు చూసి సర్ప్రైజ్ అవుతుంటాను. సినిమాని చాలా బ్యూటిఫుల్ గా తీశారు. సింహ మనలో ఒకడు అనిపించే యాక్టర్. సత్య లాంటి యాక్టర్ తో పని చేయడం ఒక బ్లెస్సింగ్. సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు. ఎంత మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్.
డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నేను అనే సినిమా చూశాను. సూపర్ గా ఉంది. అంత మంచి సక్సెస్ అందుకున్న నిర్మాత చెర్రీ గారికి, టీం అందరికీ కంగ్రాట్స్. డైరెక్టర్ రితిష్ గారి వర్క్ ని ఫాలో అవుతున్నాను. మరిన్ని సినిమాలు చేసి నవ్వించాలని కోరుకుంటున్నాను. సింహ ఈ సినిమాని తన భుజాలపై మోసారు. సత్య స్టార్ కమెడియన్ అయిపోయారు. ఇలానే అందరిని నవ్వించాలి. అందరూ సినిమాని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు
డైరెక్టర్ మహేష్ బాబు మాట్లాడుతూ… ఇప్పుడే సినిమా చూసొచ్చాను. సినిమా సూపర్ ఉంది. రితేష్ రైటింగ్ బ్రిలియంట్ గా ఉంది . సత్య పర్ఫామెన్స్ చూసిన తర్వాత తనకు సీన్ రాయాలంటే భయమేస్తుంది. సింహ చాలా అద్భుతంగా చేశారు. మ్యూజిక్ ఎడిటింగ్ డిఓపి అన్ని సూపర్ గా ఉన్నాయి. సినిమాని చాలా ఎంజాయ్ చేశాను టీమ్ అందరికీ కంగ్రాట్స్. మూడో పార్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను’ అన్నారు. యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది.
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యాన్ని, గొప్పదనాన్ని చాటి చెప్పేలా ‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్‌ను తయారు చేశారు. బ్రహ్మ శ్రీ…
The album Vasavi Sakshatkaram was created to celebrate and showcase the divine significance of Sri…
Under the banners of Sri Jaganmatha Renuka Creations and Four Founders, the film "Raja Markandeya"…
శ్రీ జగన్మాత రేణుకా క్రియేషన్స్, ఫోర్ ఫౌండర్స్ పతాకాలపై బన్నీ అశ్వంత్ దర్శకత్వంలో సామా శ్రీధర్, పంజాల వెంకట్ గౌడ్…
"డాకు మహారాజ్"లో పోషించినపాయల్ పాత్రకు దండిగా ప్రశంసలుఅందుకుంటున్న చైల్డ్ ఆర్టిస్ట్ గగన గీతిక "డాకు మహారాజ్ లో నటించే అవకాశం…
Child artist Gagana Geethika, who played the role of Payal in "Daku Maharaj", is receiving…