అజయ్‌, వీర్తి వఘాని, మురళీధర్ రెడ్డి ముక్కర, హనుమాన్ వాసంశెట్టి, ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ `కొత్త కొత్తగా’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అజయ్‌, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, హనుమాన్ వాసంశెట్టి ద‌ర్శక‌త్వంలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ `కొత్త కొత్తగా’. ఆనంద్ (సీనియర్ హీరో), తులసి, కాశీవిశ్వనాద్, కల్యాణి నటరాజన్ ప్రధాన తారాగ‌ణంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని బి జి గోవిందరాజు సమర్పిస్తున్నాను. ఈ చిత్రం సెప్టెంబర్ 9న  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

న్యూ ఏజ్ లవ్ స్టొరీగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు. రెండు నిమిషాల 30 సెకన్లు నిడివి గల ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. యూత్ ఫుల్ ఎలిమెంట్స్, డిఫరెంట్ లవ్ స్టొరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ ట్రైలర్ టైటిల్ కి తగ్గట్టే  కొత్త కొత్తగా వుంది.

సరదా ఫ్యామిలీ, కాలేజ్ ఎంటర్ టైమెంట్ తో మొదలై చివర్లో సీరియస్ డ్రామాగా మలుపు తీసుకోవడం కథపై మరింత ఆసక్తిని పెంచింది. అజయ్‌, వీర్తి వఘాని తమ నటనతో ఆకట్టుకున్నారు. కాశీ విశ్వనాధ్, తులసి, కల్యాణి నటరాజన్ పాత్రలు కీలకంగా వున్నాయి.

సాంకేతికంగా ట్రైలర్ వున్నంతంగా వుంది. ట్రైలర్ కు శేఖర్ చంద్ర అందించిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. సిద్ శ్రీరామ్ పాడిన ఆకాశం నా కోసం పాట నేపధ్యంలో అద్భుతంగా వుంది.
వెంకట్ కెమెరా, పనితనం డీసెంట్ గా వుంది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలని పెంచింది.

ఈ చిత్రానికి ప్రవీణ్ పూడి ఎడిటర్ గా, సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

న‌టీన‌టులు- అజయ్ , వీర్తి వఘాని, ఆనంద్ (సీనియర్ హీరో), కాశీ విశ్వనాధ్ ,తులసి, కల్యాణి నటరాజన్, పవన్ తేజ్, ఈరోజుల్లో సాయి త‌దిత‌రులు.

సాంకేతిక విభాగం :
దర్శకత్వం: హనుమాన్ వాసంశెట్టి
నిర్మాత: మురళీధర్ రెడ్డి ముక్కర
బ్యానర్: ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్
స‌మ‌ర్పకులు: బి జి గోవింద రాజు
సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర
ఎడిటర్: ప్రవీణ్ పూడి
కెమెరా- వెంకట్
ఫైట్ మాస్టర్: పృధ్వీ శేఖర్
ఆర్ట్ డైరెక్టర్: సురేష్ భీమగాని
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago