పూర్ణోదయ క్రియేషన్స్, శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్, మిత్ర వింద మూవీస్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన నేచురల్ స్టార్ నాని

ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ రొమ్-కామ్ ఎంటర్ టైనర్ `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`.  శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

‘జాతిరత్నాలు’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు.  

టీజర్ తో ఇప్పటికే ప్లాట్‌లైన్‌ను రివిల్ చేయగా, ట్రైలర్ మరిన్ని విజువల్స్, కంటెంట్‌ను ఇంటరెస్టింగా ప్రెసెంట్ చేసింది. హీరోకి తన గర్ల్ ఫ్రండ్ ని మెప్పించే అవకాశం వస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని కోరుతుంది హీరో గర్ల్ ఫ్రండ్.

టిక్కెట్ల కోసం  అన్ని విధాలుగా ప్రయత్నించి విఫలమైన హీరో చివరి ప్రయత్నంగా నేరుగా థియేటర్‌ వద్దకు వెళ్తాడు. అక్కడ భారీగా ప్రేక్షకులను, అభిమానుల జాతరని చూస్తాడు. హీరో తన ప్రేయసితో కలసి ఖుషి ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూడటం ఇందులో కథాంశం

ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా వెన్నెల కిషోర్ పాత్ర సినిమాలో అలరించబోతోందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. తనికెళ్ల భరణి హీరో తండ్రి పాత్రలో కనిపించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచితా బాషుల కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మహేష్, శ్రీనివాస్ రెడ్డి, గంగవ్వ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. దర్శకుడు వంశీధర్ పాత్ర నవ్వులు పూయించింది. ట్రైలర్ లో చివరి సీక్వెన్స్ చాలా ఫన్నీగా ఉంది. ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచింది.

నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. రాధన్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కామెడీ మరింత ఎలివేట్ చేశారు. ఈ చిత్రానికి ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా మాధవ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

 `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో’ త్వరలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

తారాగణం: శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివిఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్, సాయి చరణ్ బొజ్జా

సాంకేతిక విభాగం
సమర్పణ: ఏడిద శ్రీరామ్
కథ: అనుదీప్ కెవి
నిర్మాత: శ్రీజ ఏడిద
దర్శకత్వం: వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పి
స్క్రీన్ ప్లే: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్, కళ్యాణ్
డైలాగ్స్: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్
సంగీతం: రాధన్
డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటర్: మాధవ్
పీఆర్వో : వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

15 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

15 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

15 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago