జీ కుటుంబం అవార్డ్స్ 2022′ ఈ 16న 5:30 గంటలకు ప్రసారం

హైదరాబాద్, అక్టోబర్ 12, 2022: రోజురోజుకి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న ‘జీ తెలుగు’ ఈ జర్నీలో తమతో పాటు నడిచిన నటులని, డైరెక్టర్లని, రచయితలని, ప్రొడ్యూసర్లని, ఇతర జీ కుటుంబ సభ్యులని ప్రోత్సయించడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది. ‘జీ తెలుగు కుటుంబం అవార్డ్స్’ ద్వారా ప్రతి సంవత్సరం అద్భుతమైన ప్రజాదరణ కనబరిచిన జీ కుటుంబ సభ్యులని గౌరవిస్తూ వస్తుంది. ఐతే, ఈసారి కుటుంబం అవార్డ్స్ మునుపెన్నడూ లేనంత గ్రాండ్ గా కాస్త ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచుతూ నిర్వహింపబడింది. వందలాదిగా సినీ మరియు టీవీ ప్రముఖులు తరలివచ్చిన ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో మీ అభిమాన నటులు అవార్డులు గెలుచుకున్నారో లేదో తెలియాలంటే అక్టోబర్ 16న (ఆదివారం) సాయంత్రం 5:30 గంటల వరకు వేచిఉండాల్సిందే!
శ్రీముఖి, సుధీర్ మరియు ప్రదీప్ యాంకర్లుగా వ్యవహరించిన ఈ ఈవెంట్ ఉత్తమ కథానాయకుడు, ఉత్తమ భార్య, ఉత్తమ కుటుంబం, ఉత్తమ భర్త వంటి మరెన్నో కేటగిరీల్లో అవార్డ్స్ ను అందజేయనుంది.

హీరోయిన్లు అంజలి, లక్ష్మి రాయ్, జీ అత్తాకోడళ్లు, మరియు సీరియల్ హీరోహీరోయిన్లు చేసిన అద్భుతమైన డాన్స్ ప్రదర్శనలు, జీ సరిగమప గాయకుల మైమరిపించే పెర్ఫార్మన్స్, మరియు డాన్స్ ఇండియా ఇండియా తెలుగు కంటెస్టెంట్స్ యొక్క ఎనర్జిటిక్ స్టెప్స్ ఆకట్టుకోనున్నాయి. అవార్డ్స్ అందుకున్న అనంతరం పలువురు నటీనటులు చేసిన భావోద్వేగభరిత ప్రసంగాలు ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.జీ తెలుగు కుటుంబ సభ్యులతో పాటు, నటులు అంజలి, లక్ష్మి రాయ్, నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి, బాబు మోహన్, సాయి కుమార్, సోహెల్, తేజ సజ్జ, శ్రీనివాస్ రెడ్డి, నిహారిక కొణిదెల, ఎస్తర్, శివ బాలాజీ, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే, దర్శకులు బోయపాటి శ్రీను, మారుతీ, తేజ, మరియు మల్లిడి వసిష్ఠ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago