హైదరాబాద్, 1 అక్టోబర్ – అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ ఆహా ద్వారా ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు నటసింహం నందమూరి బాలకృష్ణ. సీజన్ 2 కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. 100 % లోకల్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతోన్న ఆహా తెలుగు ఈసారి కూడా ఎవరూ చూడని విధంగా బాలయ్య బాబు ని అభిమానులకి చూపించబోతుంది. ఐఏండిబి లో టాక్ షో అన్నింటిలోనూ అన్ స్టాపబులే నెంబర్ వన్ ఉండేలా నిలబెట్టారు బాలకృష్ణ. మొదటి సీజన్ ను ఘనవిజయంగా పూర్తి చేసిన ఆహా. ఇప్పుడు సీజన్ 2 తో రావడానికి రెడీ అవుతోంది. అందు కోసం మరోసారి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తో జతకటింది మన ఆహ.జాంబీ రెడ్డి, మరియు కల్కి లాంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ 2011 లో దీనమ్మ జీవితం అనే షార్ట్ ఫిలిం తో ఆయన ప్రయాణం మొదలుపెట్టారు. అలా మొదలుబెట్టిన తన ప్రయాణం దర్శకత్వం అన్ స్టాపబుల్ సీసన్ 1 వరకు సాగింది. నందమూరి బాలకృష్ణను ఇలా కూడా చూడగలమా అనేంత గొప్పగా చూపించారు.
ఇప్పుడు మరోసారి ఎవరూ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణ ను చూపించబోతున్నారు ప్రశాంత్ వర్మ. ఆహా వారు ట్రైలర్ ని అక్టోబర్ 4 విజయవాడ లో అభిమానుల ముందు ప్రదర్శించబోతున్నారు.దర్శకులు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, “సీజన్ 1 ప్రోమో షూట్ తర్వాత బాలకృష్ణ గారితో మరోసారి తప్పకుండా పనిచేయాలని చాలా గట్టిగా అనుకున్నాను, అందుకే ఈసారి కూడా అవకాశం నాకే వచ్చింది. ఆహ టీం సీజన్ 2 ట్రైలర్ కోసం స్టోరీ రాయాలి అనగానే, నేను వెంటనే ఒప్పుకున్నాను. బాలయ్య గారితోటి పని చేయడమంటేనే ఒక అద్భుతం. ఈ స్టోరీ అందరికి నచ్చే విధంగా తీర్చిదిద్దుతాను. ఒక విధంగా ఇది నా ముద్దుబిడ్డ అని చెప్పొచ్చు. అక్టోబర్ 4 న మీరు చూసే ట్రైలర్ అందరికి నచ్చుతుందుని ఆశిస్తున్నాను.”దర్శకుడి పైసా వసూల్ కథ మరియు బాలయ్య బాబు ఆక్షన్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే అక్టోబర్ 4 న జరిగే ట్రైలర్ రిలీజ్ అందరూ చూడాల్సిందే. విజయవాడలో జరిగే ఈ వేడుకకు అందరూ ఆహ్వానితులే.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…