చిరంజీవి గారి కోసమే గాడ్ ఫాదర్ చేశాను

భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ ‘గాడ్ ఫాదర్’. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌ లపై ఆర్‌ బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌ గా నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రం హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబై లో గ్రాండ్ జరిగింది.ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..’గాడ్ ఫాదర్’ లో ఒక బలమైన పాత్ర వుంది. లూసిఫర్ లో ఆ పాత్రని చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చేశారు. గాడ్ ఫాదర్ లో ఈ పాత్రని సల్మాన్ భాయ్ చేస్తే బావుంటుందని భావించాం. మేము కోరగానే ”నేను చేయాలని మీరు కోరినట్లయితే మరో ఆలోచన లేకుండా చేస్తాను. మీరు ఇంకెం అలోచించకండి. నేను చేస్తాను” అని మాపై ఎంతో ప్రేమ చూపించారు సల్మాన్ భాయ్. సల్మాన్ భాయ్  ఓకే చేసిన తర్వాత ఈ సినిమా ఆరా మరింతగా పెరిగింది. షూటింగ్ లో మాకు ఎంతగానో సహకరించారు. సల్మాన్ భాయ్ గాడ్ ఫాదర్ లోకి రావడం..ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పడానికి తొలిమెట్టు. మాపై ఎంతో ప్రేమ, ఆప్యాయతతో ఈ సినిమా చేశారు. సల్మాన్ భాయ్ తో కలసి ఈ సినిమాని చాలా జోష్ ఫుల్ గా చేశాను. 

ఆ జోష్ ని తెరపై చూస్తారు” అన్నారుసూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ .. చిరంజీవి గారు ఈ సినిమా గురించి చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను.  సినిమాల పట్ల చిరంజీవి గారికి, మాకున్న ప్రేమ దీనికి కారణం. చిరంజీవి గారితో నటించడం మంచి అనుభవం. ఇందులో చాలా కొత్త పాత్ర చేశాను. మల్టీస్టారర్లు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే వుంటాను. మల్టీ స్టార్ చిత్రాలు చేయడం పరిశ్రమకు మంచింది. సినిమాలని నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ప్రపంచమంతా చూస్తారు. నెంబర్స్ పెరుగుతాయి. గాడ్ ఫాదర్ నా తొలి తెలుగు సినిమా. ప్రేక్షకులని కచ్చితంగా అలరిస్తుంది” అన్నారు.సత్యదేవ్ మాట్లాడుతూ.. ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి గారు, సల్మాన్ ఖాన్ గారి ముందు నిలుచుని మాట్లాడటం గొప్ప అనుభూతి. అన్నయ్య గారిపై ప్రేమతో నటుడిని అయ్యాను. అన్నయ్యే ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేశారు. అన్నయ్యకి ఎదురుగా నటించడం పెద్ద  సవాల్. సల్మాన్ ఖాన్ గారి రూపంలో మరో సవాల్ వచ్చింది (నవ్వుతూ). 

ఇద్దరు మెగాస్టార్లుకి ఎదురుగా నిలబడే పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఎప్పుడూ ఊహీంచలేదు. నా బెస్ట్ ఇవ్వడనికి ప్రయత్నించాను. మోహన్ రాజా గారు సినిమాని చాలా కూల్గా డీల్ చేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది. అక్టోబర్ 5న మీ అందరినీ అలరిస్తుంది’న్నారు.దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ.. ఇద్దరు మెగాస్టార్లుని డైరెక్ట్ చేయడం నా కల నేరవేరినట్లయింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. నిర్మాతలు ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ ని ఇస్తుంది. సినిమా అందరూ తప్పకుండా థియేటర్లో చూడాలి” అని కోరారు.

Tfja Team

Recent Posts

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

7 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

7 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

7 days ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

7 days ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

7 days ago

పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లందరికీ ఇది ఒక పాఠం — ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…

1 week ago