“మీట్ క్యూట్” ప్లెజంట్ వెబ్ సిరీస్ గా ఆకట్టుకుంటుంది

Must Read

నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహించిన తొలి వెబ్ సిరీస్ మీట్ క్యూట్. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని ఈ సిరీస్ ను నిర్మించారు. ఐదు కథల ఆంథాలజీగా ఆమె తెరకెక్కించిన ఇందులో వర్ష బొల్లమ్మ, శ్రీదివ్య, సమీర్, అశ్విన్ కుమార్, సత్యరాజ్, రుహానీ సఱ్మ, రాజ్ చెంబోలు, రోహిణి మొల్లేటి, ఆకాంక్షా సింగ్, దీక్షిత్ శెట్టి అలేఖ్య హారిక, ఆదా శర్మ, శివ కందుకూరి, సునైన తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 25న సోని లివ్ లో మీట్ క్యూట్ ఎక్స్ క్లూజివ్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దీప్తి, నాని తాజా ఇంటర్వ్వూలో మీట్ క్యూట్ విశేషాలు తెలిపారు.

దర్శకురాలు దీప్తి గంటా మాట్లాడుతూ…నేను గతంలో ఒక షార్ట్ ఫిలిం చేశాను. మీట్ క్యూట్ లో ఒక కథ రాసినప్పుడు నానికి వినిపిస్తే ఇలాంటివి ఇంకో మూడు నాలుగు రాయి కలిపి ఆంథాలజీ చేయొచ్చు అని సలహా ఇచ్చాడు. నాని అడిగినా కూడా ఏదైన మంచి ఆలోచన ఇన్స్ పైర్ చేశాకే స్క్రిప్ట్ రాశాను. ప్రయాణాల్లో, ఇతర సందర్భాల్లో ఎవరైనా తెలియనివారితో పరిచయం చేసుకుని మాట్లాడటం నాకు అలవాటు. అలాంటి అపరిచిత వ్యక్తుల మధ్య సంభాషణ ఎలా ఉంటుంది అనే ఊహతో ఈ స్క్రిప్ట్ మొదలుపెట్టాను. మన లైఫ్ లో ఎదురయ్యే ప్లెజంట్ మూమెంట్స్ తో పాటు వివిధ సందర్భాలను ఈ కథల్లో చూపిస్తాం. సత్యరాజ్, అశ్విన్, ఆదా శర్మ ఇలాంటి మంచి ఆర్టిస్టులు నా కథలోకి రావడం సంతోషాన్నిచ్చింది. అర్బన్ బేస్డ్ గా ఈ కథ సాగుతుంది. అయినా ప్రేక్షకులందరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఓ మంచి లవ్ స్టోరి రాస్తే ఆ కథను నాని హీరోగా తెరకెక్కిస్తా. ఇకపైనా మంచి ఫీల్ గుడ్ స్క్రిప్ట్ రాసి డైరెక్ట్ చేస్తాను. అని చెప్పింది.

నాని మాట్లాడుతూ…ఫస్ట్ ఈ స్క్రిప్ట్ చాలా రోజులు చదవకుండా పక్కన పెట్టాను. చదివిన వారంతా బాగుంది అని చెప్పినా అలాగే చెప్తారు అనుకున్నా. మా సిస్టర్ ప్రెజర్ చేసే సరికి చదవడం ప్రారంభించాను. కొద్ది పేజీలు చదివేసరికి ఆ కథలో లీనమయ్యాను. అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మీట్ క్యూట్ అనే స్క్రిప్ట్ మా సిస్టర్ కాకుండా మరెవరు రాసినా ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చేవాడిని. నాకు స్క్రిప్ట్ ఇచ్చేవారు పోన్ నెంబర్ రాసి వెళ్తారు. అలా రాయకున్నా వాళ్లెవరో వెతికి మరీ ఈ కథను తెరకెక్కించేవాళ్లం. మీట్ క్యూట్ లో క్యారెక్టర్స్, అవి మాట్లాడుకునే మాటలు, వాళ్ల మధ్య వచ్చే సందర్భాలు అన్నీ చాలా సహజంగా ఉంటాయి. ఈ కథ సినిమాకు ఉపయోగపడదు. ఎందుకంటే మనం సినిమాల్లో ఎంత నాచురల్ స్టోరీ తీసుకున్నా దానికి కొంత డ్రామా కలుపుతాం. ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటాం. కానీ ఇందులో ఆ పాత్రలు తర్వాత ఎలా ముందుకెళ్తాయి, ఎలా ముగుస్తాయి అనే ఆసక్తి కలుగుతుంటుంది. నాకు ఇందులో నటించే క్యారెక్టర్ లేదు. సిస్టర్ డైరెక్టర్ కాబట్టి నేను ఖచ్చితంగా అతిథి పాత్రలో నటిస్తానని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ కథలో అవకాశం లేకుండా నటిస్తే పేరుకు కనిపించినట్లు ఉంటుంది. ఆంథాలజీ అంటే ఒక్కో కథను ఒక్కొక్కరు డైరెక్ట్ చేస్తారు. కానీ ఈ కథను తను ఒక్కరే తెరకెక్కించారు. ఈ సిరీస్ అంతా ప్లెజంట్, ఏదో ఒక మంచి విషయాన్ని, మంచి మాటను ఇది చూశాక నేర్చుకుంటాం. రోహిణి, ఆకాంక్ష మధ్య వచ్చే సన్నివేశాలు నాకు బాగా నచ్చాయి. మంచి కంటెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు వాల్ పోస్టర్ సంస్థ ద్వారా నిర్మిస్తాం. అన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News