ఆస్ట్రేలియా ఫిల్మ్ పెస్టివ‌ల్‌లో ‘దహిణి – మంత్రగత్తె’

Must Read

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ తెరకెక్కించిన మరో విలక్ష‌ణ చిత్రం ‘దహిణి – మంత్ర‌గ‌త్తె’. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ వేదిక‌ల‌పై ఈ సినిమా అద్భుత‌మైన స్పంద‌న‌ను, అవార్డుల‌ను రాబ‌ట్టుకుంటోంది. తాజాగా రాజేష్ ట‌చ్ రివ‌ర్ కీర్తి కిరీటంలో మ‌రో వ‌జ్రం చేరింది. ఆస్ట్రేలియాలో జ‌రిగిన టైటాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ పెస్టివ‌ల్‌లో బెస్ట్ ఫీచ‌ర్ ఫిల్మ్‌గా ‘దహిణి – ది విచ్’ అవార్డ్‌ను ద‌క్కించుకుంది. ఈ అవార్డును సోమ‌వారం రోజున‌ సిడ్నీలోని ప్యాలెస్ చౌవెల్ సినిమాలో ఘ‌నంగా నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ సంవ‌త్స‌రం ప్రారంభంలో ప‌సిఫిక్ బీచ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్ వేడుక‌ల్లో బెస్ట్ ఫీచ‌ల్ ఫిల్మ్‌గా నిలిచింది. స్వీడిష్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ వేడుక‌ల్లో బెస్ట్ ఫీచ‌ర్ మూవీగా నామినేట్ అయ్యింది.

ద‌హిణి – మంత్ర‌గ‌త్తె మూవీ సోష‌ల్ థ్రిల్ల‌ర్. భార‌త‌దేశం 17 రాష్ట్రాల‌ అన్వేష‌ణ‌లో ఉన్న మంత్ర‌గ‌త్తె క‌థే ఈ సినిమా. ఇదొక క్రూర‌మైన వాస్త‌విక‌త‌. అంత‌ర్జాతీయంగా పలు ప్ర‌శంస‌ల‌ను అందుకున్న ద‌ర్శ‌కుడు రాజేష్ ట‌చ్ రివ‌ర్ మంత్ర‌గ‌త్తె అన్వేష‌ణ అనే విల‌క్ష‌ణ‌మైన కాన్సెప్ట్‌తో సినిమాను తెర‌కెక్కించారు. దీంతో ఇండియా స‌హా ప‌లు దేశాలను పీడిస్తున్న మాన‌వ హ‌క్కులకు సంబంధించిన ఆందోళ‌న‌ను ప్ర‌స్తావించారు.

లింగ బేద‌మైన హింస‌కు సంబంధించిన రూపాల్లో మంత్ర‌గత్తె అన్వేష‌ణ అనేది ఒక‌టి. సాధారణ లింగ నిబంధనలకు అనుగుణంగా లేని వేలాది మంది మహిళలను చంపడానికి లేదా వ్యక్తుల మధ్య వివాదాలను పరిష్కరించడానికి దీన్ని ఒక కార‌ణంగా చూపించారు.

ఈ సినిమాతో అస‌లు ఎవ‌రూ బ‌హిరంగంగా మాట్లాడ‌ని విష‌యాల‌ను స్క్రీన్‌పై చూపించే ప్ర‌య‌త్నం చేశారు. సినిమాను పూర్తిగా ఒరిస్సాలో మంత్ర‌గ‌త్తెల అన్వేష‌ణ ఎక్కువ‌గా ఉండే మ‌యూర్ భంజ్ జిల్లాలో చిత్రీక‌రించారు.

అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు ద‌క్కించుకున్న జాతీయ అవార్డు గెలుగుచుకున్న యాక్ట‌ర్ త‌న్నిష్ట చ‌ట‌ర్జీ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. జె.డి.చ‌క్ర‌వ‌ర్తి ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడూ చేయ‌న‌టువంటి ఓ వైవిధ్యమైన పాత్ర‌ను పోషించ‌టం విశేషం. ఇంకా అషికీ హుస్సేన్‌, బ‌ద్రూల్ ఇస్లామ్‌, అంగ‌నా రాయ్‌, రిజ్జు బ‌జాజ్‌, జ‌గ‌న్నాథ్ సేత్‌, శ్రుతీ జ‌య‌న్‌, దిలీప్ దాస్ వంటి వెర్సటైల్ ఆర్టిస్టులు సైతం ఇందులో కీల‌క పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు.

ప‌లు అవార్డుల‌ను సొంతం చేసుకున్న సాంకేతిక నిపుణుల బృందం … సినిమాటోగ్రాఫ‌ర్ నౌష‌ద్ ష‌రీఫ్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సునీల్ బాబు, సౌండ్ డిజైన‌ర్ అజిత్ అబ్ర‌హం జార్జ్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోరర్ జార్జ్ జోసెఫ్‌, ఎడిట‌ర్ శ‌శి కుమార్‌, మేక‌ప్ డిజైన‌ర్ ఎన్‌జి రోష‌న్‌, మాటలు: రవి పున్నం, పాట రాసిన డా.గోపాల్ శంక‌ర్ త‌దిత‌రులు ఈ చిత్రానికి వ‌ర్క్ చేశారు.

ఓరియన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, సన్‌టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై పద్మశ్రీ అవార్డు గ్రహీత, మానవతా నాయకురాలు సునీత కృష్ణన్.. ప్రదీప్ నారాయణన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News