హైదరాబాద్, 16 సెప్టెంబర్, 2022: ఊహకందని సర్ప్రైజెస్ తో వీక్షకులను ఆశ్చర్యపరచడంలో ‘జీ తెలుగు’ ఎల్లప్పుడూ ముందుంటుంది! దీన్ని మరోసారి నిరూపిస్తూ చేస్తూ, ‘జీ తెలుగు’ త్వరలో మొదలుకానున్న మూడు ఫిక్షనల్ షోస్ యొక్క ప్రోమోషన్స్లో భాగంగా సూపర్స్టార్ మహేష్ బాబు తన కూతురు సితారతో మరియు సీరియల్స్ లోని నటీనటులతో కలిసి చేసిన మ్యూజికల్ కాన్సెప్ట్ ప్రోమో రిలీజ్ చేసింది. ‘పడమటి సంధ్యారాగం’, ‘అమ్మాయిగారు’, మరియు ‘శుభస్య శీఘ్రం’ సీరియల్స్ యొక్క కథాంశాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ చిత్రీకరించిన ఈ వీడియోలో తండ్రీకూతుర్ల కెమిస్ట్రీ మరియు సితార అద్భుతమైన నటన, తన చలాకితత్వం, మరియు స్క్రీన్ ప్రసేన్స్ అందరిని ఆకట్టుకుంటుంది. అద్భుతమైన కథాంశం మరియు నిర్మాణ విలువలతో చిత్రీకరించబడిన ఈ మ్యూజికల్ కాన్సెప్ట్ ప్రోమో ‘సీతారామం’ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించగా, ఎస్.పి చరణ్ తన గాత్రాన్ని అందించాడు.
మహేష్ బాబు-సితార కలిసి నటించిన మ్యూజికల్ కాన్సెప్ట్ ప్రోమో కోసం
కింది లింక్ ను క్లిక్ చేయండి
ఈ ప్రోమో ఈ మూడు సీరియల్స్ పై అంచనాలు అమాంతం పెంచేయగా, అందులో ప్రతిష్టాత్మకంగా నిర్మాణింపబడుతున్న ‘పడమటి సంధ్యారాగం’ అనే సీరియల్ మొదటగా ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19 నుండి రాత్రి 8 గంటలకు ప్రసారం కానున్న ఈ సీరియల్ లోని సన్నివేశాలు విదేశాల్లో కూడా చిత్రీకరింపబడటం విశేషం. అమెరికాలో పాశ్చాత్య సంస్కృతిలో పుట్టి పెరిగిన అమ్మాయి ఒక సంప్రదాయకరమైన తన పెద్దమ్మ కుటుంబంలో ఉండాల్సివస్తే జరిగే పరిణామాలని ఆధారంగా చేసుకుని ఈ కథ సాగుతుంది. ఇందులో, జయశ్రీ, సాయి కిరణ్ మరియు తదితరులు ప్రముఖ పాత్రలలో ఆకట్టుకోనున్నారు.
అదేవిధంగా, తన తండ్రి ఆప్యాయత కోసం పరితపించే ఒక అమ్మాయి జీవితం ఆధారంగా చిత్రీకరింపబడుతున్న మరో సీరియల్ ‘అమ్మాయిగారు’. నిషా మిలనా మరియు అనిల్ అల్లం తదితరులు నటించబోతున్న ఈ సీరియల్ అతి త్వరలో మొదలుకానుంది. ఇక, ఒక మధ్యతరగతి తల్లి యొక్క కూతురు తన కుటుంబాన్ని ఆపదల నుండి ఎలా కాపాడుతుందో కథాంశంగా ‘శుభస్య శీఘ్రం’ పేరుతో త్వరలో మరో సరికొత్త సీరియల్ ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ, “ప్రతి కథకు దానికంటూ ఒక సోల్ మరియు ప్రేక్షకులు ఉంటారు. అందుచేత, వాటిని ఒక వినూత్నమైన ట్రీట్మెంట్ తో ప్రపంచంలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ మూడు సీరియల్స్ యొక్క కథలు ప్రేక్షకులు వారికి రిలేట్ చేసుకునే విధంగా ఉన్నాయి.ఈ సీరియల్స్ ని ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు నేను ‘జీ తెలుగు’ తో జతకట్టడం ఎంతో ఆనందంగా ఉంది. అంతేకాకుండా, దీన్ని నా కూతురితో కలిసి చేయడం ఇంకా ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా, ఈ మూడు సీరియల్స్ యొక్క టీమ్స్ కి మరియు ఛానల్ యాజమాన్యానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు,” అని తెలిపారు.
అనురాధ గూడూరు, చీఫ్ కంటెంట్ ఆఫీసర్, జీ తెలుగు, మాట్లాడుతూ,”మహేష్ బాబు మరియు ‘జీ తెలుగు’ అనుబంధం గతంలో మంచి ఫలితాలను తెచ్చిపెట్టింది. మహేష్ బాబు తన కూతురు సితారతో కలిసి చేసిన ఈ మ్యూజికల్ కాన్సెప్ట్ ప్రోమో తమ సీరియల్స్ ని ప్రజలలోకి తీసుకెళ్లడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఎల్లప్పటిలాగే, వీక్షకులు తమ సీరియల్స్ ని ఆదరించి, విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను,” అని చెప్పారు.
త్వరలో ‘పడమటి సంధ్యారాగం’ మొదలవుబోతుండడంతో అలాగే ‘ముత్యమంత ముద్దు’ సమాప్తమవబోతుండడంతో, ఛానల్ రెండు సీరియల్స్ యొక్క టెలికాస్ట్ సమయాలలో మార్పులు చేసింది. ఇక నుండి, ఊహలు గుసగుసలాడే మధ్యాహ్నం 12:30కు గాను, ముక్కుపుడక మధ్యాహ్నం ఒంటి గంటకు గాను ప్రసారం కానున్నాయి.
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్తోపాటు చక్కటి సోషల్ మెసేజ్తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…