ZEE5లో హర్రర్-కామెడీ జానర్‌లో తెరకెక్కిన ‘డెవిల్స్ డబుల్: నెక్స్ట్ లెవల్’ జూన్ 13న ప్రీమియర్ కావడానికి సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందనను దక్కించుకున్నాయి. ఈ చిత్రంలోని కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ఇప్పటికే థియేటర్లో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. సంతానం, సెల్వరాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గీతిక తివారీ నటించిన ఈ చిత్రం ఇక ఇప్పుడు ZEE5లోకి రాబోతోంది. DD నెక్స్ట్ లెవల్ జూన్ 13 నుండి ZEE5లో ప్రత్యేకంగా ప్రసారం కానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఈ చిత్రాన్ని చూడొచ్చు.
https://www.instagram.com/reel/DKwNbY2SS6P
డెవిల్స్ డబుల్: నెక్స్ట్ లెవల్ కథ అంతా కూడా సినీ విమర్శకుడు కిస్సా (సంతానం) చుట్టూ తిరుగుతుంది. అతను అసాధారణ దర్శకుడు హిచ్‌కాక్ ఇరుధయరాజ్ (సెల్వరాఘవన్) ప్రైవేట్ స్క్రీనింగ్‌లోకి రావడం, అక్కడే చిత్రంలో ఇరుక్కుపోయి బయటకు వచ్చేందుకు ప్రయత్నించడం వంటి కామెడీ, హారర్ అంశాలతో అద్యంతం వినోద భరితంగా సాగుతుంది. కిస్సా తనకు దొరికిన ఆధారాలను డీకోడ్ చేస్తూ బయటకు ఎలా వచ్చారన్నదే ఆసక్తికరంగా సాగుతుంది. జూన్ 13 నుండి ZEE5లో ప్రత్యేకంగా ‘DD నెక్స్ట్ లెవల్’ ప్రసారం కానుంది. అందరూ తప్పకుండా వీక్షించి ఎంజాయ్ చేయండి.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…