సెప్టెంబర్ లో వెల్కమ్ టు తీహార్ కాలేజ్ చిత్రం విడుదల

వైవిధ్యభరితమైన చిత్రాలు నిర్మించిన శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్ ఎల్ ఎన్ రావు మరియు యక్కలి రవీంద్ర బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్  “వెల్కమ్ టు తీహార్ కాలేజ్”. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థల్లో విద్య పేరుతో జరుగుతున్న భందిఖానాని  అరాచకాన్ని సునిశిత  హాస్యం తో చిత్రీకరించిన క్యాంపస్ చిత్రం ఇది. ర్యాంకుల పోటీలోపడి నలిగిపోతున్న యువత అంతరంగాన్ని వినోదభరితంగా ఆలోచింపజేసే విధంగా నిర్మించబడిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ మాసం లో విడుదలకు సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్. 

గతం లో శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథ, రొమాంటిక్ క్రిమినల్స్ లాంటి యూత్ ఫుల్ ఫిలిమ్స్ లో నటించిన మనోజ్ నందన్ ఈ చిత్రం లో కదా నాయకుడిగా నటిస్తున్నాడు. ఫణి చక్రవర్తి, కృష్ణ తేజ, సోనీ రెడ్డి, మనీషా, సాయినాథ్, మౌనిక  బేబీ చిన్నారి, సత్యానంద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాలేజీ సి ఈ ఓ గా  టి ఎన్ ఆర్ నటించారు. కాలేజీ లెక్చరర్ల గా  ఎఫ్ ఎమ్ బాబాయ్, వెంకట్ రామన్, ప్రసాద్, లెండి  హరి తదితరులు నటించారు. ప్రవీణ్ ఇమ్మడి స్వరపరిచిన ఐదు యూత్ ఫుల్ పాటలతో మంచి మ్యూజికల్ క్యాంపస్ ఎంటర్టైనర్ గా దీనిని  నిర్మించామని నిర్మాతలు తెలియచేసారు. . 

చక్కటి సందేశం తో పాటు యూత్ ను అలరించే అన్ని అంశాలు ఈ చిత్రంలో పొందుపరిచామని, . కాలేజ్ స్నేహానికి పటం కట్టే ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అని దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తన ఆశాభావం వ్యక్తపరిచారు. 

చిత్రం పేరు : వెల్కమ్ టు తీహార్ కాలేజ్
 బ్యానర్ : శ్రావ్య ఫిలిమ్స్ 
నటి నటులు : మనోజ్ నందన్, ఫణి చక్రవర్తి, కృష్ణ తేజ, సోనీ రెడ్డి, మనీషా, మౌనిక, తనీషా,  వినయ్ మహాదేవ్, స్టార్ మేకర్ సత్యానంద్, , బుగత సత్యనారాయణ, సముద్రం వెంకటేష్, నల్ల శ్రీను, మల్లికా తదితరులు 
కెమెరా మాన్  & ఎడిటింగ్ : సాబు జేమ్స్ 
సంగీత దర్శకుడు : ప్రవీణ్ ఇమ్మడి. 
 కలరింగ్ అమల్ వి ఎఫ్ ఎస్ : శ్యాం కుమార్ ,పీ 
పి ఆర్ ఓ : పాల్ పవన్ 
నిర్మాతలు : డాక్టర్ ఎల్ ఎన్ రావు యెక్కలి రవీంద్ర బాబు
 దర్శకుడు : పి సునీల్ కుమార్ రెడ్డి

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

15 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

15 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

15 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago