అల్లం శ్రీతన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం జైత్ర. సన్నీ నవీన్, రోహిణీ రేచల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తోట మల్లికార్జున దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అల్లం సుభాష్ నిర్మాత. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ లభించింది.
రాయలసీమ స్లాంగ్ , నేటివిటీతో తెరకెక్కిన ఈ సినిమా మట్టితో చుట్టరికం చేసే ఒక రైతు కథను అందంగా తెరకెక్కించడం జరిగింది.
తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ (అధర నా గుండెలధర) ను బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి విడుదల చేశారు.
ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాట్లాడుతూ…
రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షన్ సినిమాలు చూశాం. మొదటిసారి ఒక రైతు కథతో చాలా సహజంగా మంచి స్లాంగ్ తో రాబోతున్న సినిమా జైత్ర. ఈ మూవీ సాంగ్స్ టీజర్ బాగున్నాయి. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్న అన్నారు.
నటీనటులు:
సన్నీ, నవీన్, రోహిణి రాచల్, వంశీ నెక్కంటి, సునీత మనోహర్.
కెమెరా: మోహన్ చారి
పాటలు : కిట్టు విస్సా ప్రగడ
సంగీతం : ఫణికళ్యాన్
ఎడిటర్: విప్లవ్ నైషదం
దర్శకత్వం : తోట మల్లిఖార్జున్
నిర్మాత: అల్లం సుభాష్.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…