హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ముఖ్య అతిధి గా హైదరాబాద్ లోని కోంపల్లిలో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ప్రారంభం

హైదరాబాద్ ఫుడ్ లవర్స్ కోసం సరికొత్త థీమ్ తో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైంది. టాలీవుడ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా చేతుల మీదుగా హియ్య వారి 6 వ బ్రాంచ్ ను హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ హైదరాబాద్ లోని కోంపల్లిలో గ్రాండ్ లాంచ్ ఐయింది. కపుల్స్, పిల్లలు, పెద్దలతో పాటు అందరిని ఆకర్షించే థీమ్, అద్భుతమైన రుచి దీని ప్రత్యేకత. అంతేకాదు మండి అంటే నాన్ వెజ్ మాత్రమే కాదు, ఇక్కడ వెజ్ కూడా అంతే ప్రత్యేకం. ఈ కార్యక్రమానికి తెలుగు బ్యూటిఫుల్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోటకూరి వజ్రేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈవెంట్ కు ఆహ్వానించిన గౌతమి చౌదరికి ధన్యవాదములు తెలిపారు. హైదరాబాద్ లో ఇంత క్రియేటివ్ థీమ్ తో హియ్యా స్పేస్ మండిని ప్రారంభించడం సంతోషంగా ఉంది అన్నారు. ఇక్కడ నాన్ వెజ్ తో పాటు వెజ్ కూడా చాలా స్పెషల్ అని చెప్పారు. ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ మిక్స్ అవ్వకుండా ఫుడ్ ని తయారు చేస్తారని తెలిపారు. మసాలాలు కూడా సపరేట్ గా తయారు చేస్తారని పేర్కొన్నారు. అలాగే ఒక్కసారి వాడిన వంట నూనెను మళ్ళీ వాడరని, చాలా శుభ్రంగా కిచెన్ ను చూసుకుంటారని వెల్లడించారు. శాకాహారులు నిస్సందేహంగా ఇక్కడ రుచులను ఆస్వాదించొచ్చని తెలిపారు. ఇలాంటి థీమ్ తో కొంపల్లిలో ఈ రెస్టారెంట్ ను ప్రారంభించడం బాగుంది అన్నారు. తన అభిమానులు కచ్చితంగా విజిట్ చేయాల్సిందే అన్నారు. అలాగే ఫ్యామిలీస్ కూడా వీకెండ్స్ లో వచ్చి హియ్యా స్పేస్ మండి వాళ్ళ రుచులను చూడాలని కోరారు.

గౌతమి చౌదరి మాట్లాడుతూ.. హియ్య స్పేస్ మండి ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియా మిత్రులకు, అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. కొంపల్లి లో 6 వ బ్రాంచ్ గా హియ్య స్పేస్ మండి ప్రారంభం అవడం, అదీ బ్యూటిఫుల్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మల్టిపుల్ థీమ్స్ తో వస్తున్న మమ్మల్ని ఎంత ఆదరిస్తున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే హైదరాబాదులో ఫారెస్ట్ థీమ్, డైనోసార్ థీమ్ చూసాము. ఇటీవల అమీర్ పేట్ లో కొత్తగా స్పేస్ థీమ్ ను లాంచ్ చేశాము. ఇప్పుడు కోంపల్లిలో రెండవ బ్రాంచిగా ప్రారంభించడం సంతోషంగా ఉంది అన్నారు.

కొత్త థీమ్ తో రావడం మాత్రమే కాదు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉన్న ధరలలో మా రుచులను అందించడం మా ప్రత్యేకత అని పేర్కొన్నారు. అలాగే వెజ్, నాన్ వెజ్ ఎప్పుడు సపరేట్ గా వండుతామని.. కిచెన్ కూడా చాలా శుభ్రంగా ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. ఇలాంటి క్రియేటివ్ ఆలోచనలతో మేము రావడంతో.. మరికొంతమంది కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు. దానివలన సిటీ కూడా అభివృద్ధిలో ముందుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రాంచ్ ఓనర్స్ జశ్వంత్, లోకేష్ ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలోనే దిల్సుఖ్ నగర్ మరో కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుందని తెలిపారు. అన్ని బ్రాంచ్ లను ఆదరించినట్టుగానే కొంపల్లిలో ఉన్న బ్రాంచ్ ను ఆదరిస్తారని కోరారు.

TFJA

Recent Posts

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. ‘అమ్మ కనకదుర్గ’ అంటూ సాగే భక్తి గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించిన తమన్ అండ్ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…

5 days ago

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, నందమూరి శ్రీమంతుని

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…

5 days ago

మా నమ్మకం నిజమైంది.. తెలుగునాట ‘జైలర్ 2’ ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…

6 days ago

‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల

సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…

6 days ago

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారు – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…

6 days ago

“రణబాలి” సినిమాలోని జయమ్మ పాత్ర స్పూర్తితో 400 కుటుంబాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించిన హీరోయిన్ రశ్మిక

ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…

1 week ago