పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై నిహారిక కొణిదెల నిర్మిస్తున్న నూతన చిత్రానికి ‘పాకెట్ రాకెట్స్’ టైటిల్ ఖరారు… కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. ఈ సినిమాకు రుద్ర అత్రి దర్శకత్వం వహించనున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్‌గా నటిస్తున్నారు. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌‌ని, కాన్సెప్ట్ పోస్టర్‌ని బుధవారం నాడు రివీల్ చేశారు.

విదేశాల్లో చదువుకోవాలని అనుకునే ఓ కుర్రాడు, ఆ కలను సాకారం చేసుకునేందుకు గ్యాబ్లింగ్‌లోకి దిగడం, ఆ తర్వాత ఆ కుర్రాడి జీవితంలో ఎదురైన పరిస్థితుల్ని ‘పాకెట్ రాకెట్స్’లో ఎంతో ఆసక్తికరంగా చూపించబోతోన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. త్వరలో టీజర్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

ఈ చిత్రానికి ఎదురోలు రాజు కెమెరామెన్‌గా, అన్వల్ అలీ ఎడిటర్‌గా వర్క్ చేయనున్నారు. ఈ మూవీకి గ్యానీ సంగీతాన్ని అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాల్ని ప్రకటించనున్నారు.

ఈ సినిమాలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్లు ఫేమ్), శ్రియా కొంతం (శుభం ఫేమ్), నిర్మల్ (డెబ్యూ హీరో), జేడీ చక్రవర్తి, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు తదితరులు నటిస్తున్నారు.

బ్యానర్లు : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్
నిర్మాతలు: పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి
దర్శకుడు :రుద్ర అత్రి
కెమెరామెన్ :ఎదురోలు రాజు
మ్యూజిక్ :గ్యానీ
ఎడిటర్ : అన్వర్ అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమేష్ మన్యం
ప్రొడక్షన్ డిజైనర్ :విష్ణు వర్దన్ పుల్లా
యాక్షన్ కొరియోగ్రఫీ :రాజేష్ లంకా
కొరియెగ్రాఫర్ : జేడీ మాస్టర్
కాస్ట్యూమ్ డిజైనర్ : అనుషా దేవర
ఎస్ఎఫ్ఎక్స్ :సాయి మనీంధర్ రెడ్డి
కో డైరెక్టర్ :మురళీ కృష్ణ కట్టా
మేకప్ చీఫ్ :పసుపులేటి రవి కుమార్
కాస్ట్యూమ్ చీఫ్ :ఆర్. భూపాల్ రావు
ప్రొడక్షన్ కంట్రోలర్ : రవిందర్ బెక్కం
స్టిల్స్ : వరాహాల మూర్తి
ఈవెంట్ పార్టనర్: యువి మీడియా
మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ
పీఆర్వో : ఎస్.కె. నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)

TFJA

Recent Posts

“సమ్మర్ హాలిడేస్” సినిమా ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది, ఈ దీపావళికి ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చూడండి – ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ హీరో శ్రీవిష్ణు

నవంబర్ 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "సమ్మర్ హాలిడేస్" కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్…

2 hours ago

‘రుద్రవనం పీఎస్’ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను – గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్

ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్ల మీద రమేష్ పుప్పాల, సూర్యకాంతి నిర్మాతలుగా శశిధర్ మున్నంగి తెరకెక్కించిన న్యూ…

3 hours ago

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ముఖ్య అతిధి గా హైదరాబాద్ లోని కోంపల్లిలో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ప్రారంభం

హైదరాబాద్ ఫుడ్ లవర్స్ కోసం సరికొత్త థీమ్ తో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైంది. టాలీవుడ్ బ్యూటీ…

6 days ago

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. ‘అమ్మ కనకదుర్గ’ అంటూ సాగే భక్తి గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించిన తమన్ అండ్ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…

2 weeks ago

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, నందమూరి శ్రీమంతుని

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…

2 weeks ago

మా నమ్మకం నిజమైంది.. తెలుగునాట ‘జైలర్ 2’ ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…

2 weeks ago