వైవిధ్యభరితమైన చిత్రాలు నిర్మించిన శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్ ఎల్ ఎన్ రావు మరియు యక్కలి రవీంద్ర బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ “వెల్కమ్ టు తీహార్ కాలేజ్”. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థల్లో విద్య పేరుతో జరుగుతున్న భందిఖానాని అరాచకాన్ని సునిశిత హాస్యం తో చిత్రీకరించిన క్యాంపస్ చిత్రం ఇది. ర్యాంకుల పోటీలోపడి నలిగిపోతున్న యువత అంతరంగాన్ని వినోదభరితంగా ఆలోచింపజేసే విధంగా నిర్మించబడిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ మాసం లో విడుదలకు సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్.
గతం లో శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథ, రొమాంటిక్ క్రిమినల్స్ లాంటి యూత్ ఫుల్ ఫిలిమ్స్ లో నటించిన మనోజ్ నందన్ ఈ చిత్రం లో కదా నాయకుడిగా నటిస్తున్నాడు. ఫణి చక్రవర్తి, కృష్ణ తేజ, సోనీ రెడ్డి, మనీషా, సాయినాథ్, మౌనిక బేబీ చిన్నారి, సత్యానంద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాలేజీ సి ఈ ఓ గా టి ఎన్ ఆర్ నటించారు. కాలేజీ లెక్చరర్ల గా ఎఫ్ ఎమ్ బాబాయ్, వెంకట్ రామన్, ప్రసాద్, లెండి హరి తదితరులు నటించారు. ప్రవీణ్ ఇమ్మడి స్వరపరిచిన ఐదు యూత్ ఫుల్ పాటలతో మంచి మ్యూజికల్ క్యాంపస్ ఎంటర్టైనర్ గా దీనిని నిర్మించామని నిర్మాతలు తెలియచేసారు. .
చక్కటి సందేశం తో పాటు యూత్ ను అలరించే అన్ని అంశాలు ఈ చిత్రంలో పొందుపరిచామని, . కాలేజ్ స్నేహానికి పటం కట్టే ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అని దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తన ఆశాభావం వ్యక్తపరిచారు.
చిత్రం పేరు : వెల్కమ్ టు తీహార్ కాలేజ్
బ్యానర్ : శ్రావ్య ఫిలిమ్స్
నటి నటులు : మనోజ్ నందన్, ఫణి చక్రవర్తి, కృష్ణ తేజ, సోనీ రెడ్డి, మనీషా, మౌనిక, తనీషా, వినయ్ మహాదేవ్, స్టార్ మేకర్ సత్యానంద్, , బుగత సత్యనారాయణ, సముద్రం వెంకటేష్, నల్ల శ్రీను, మల్లికా తదితరులు
కెమెరా మాన్ & ఎడిటింగ్ : సాబు జేమ్స్
సంగీత దర్శకుడు : ప్రవీణ్ ఇమ్మడి.
కలరింగ్ అమల్ వి ఎఫ్ ఎస్ : శ్యాం కుమార్ ,పీ
పి ఆర్ ఓ : పాల్ పవన్
నిర్మాతలు : డాక్టర్ ఎల్ ఎన్ రావు యెక్కలి రవీంద్ర బాబు
దర్శకుడు : పి సునీల్ కుమార్ రెడ్డి
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…