దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ హీరోహీయిన్లుగా నటించిన చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అద్భుతమైన ప్రశంసలు తో పాటు, బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలక్షన్స్ వచ్చాయి.

ఆగష్టు 5న రిలీజైన ఈ చిత్రానికి ఇప్పటికి మంచి ఆదరణ లభిస్తుంది.

ఈ సంవత్సరం విడుదలైన ఉత్తమ ప్రేమకథలలో ఒకటిగా నిలిచింది సీతారామం. హను ఈ సినిమాను తెరకెక్కించిన విధానం, దుల్కర్ మరియు మృణాల్ మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.

సీతారామం స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో పొందింది మరియు ఈ చిత్రం సెప్టెంబర్ 9 నుండి వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.

అయితే, ఈ చిత్రం ఇంకా థియేట్రికల్ రన్‌ను కొనసాగిస్తూనే ఉంది. వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న, సుమంత్ మరియు తరుణ్ భాస్కర్ కూడా కీలక పాత్రల్లో నటించారు.
