రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ కన్నుమూశారు.

Must Read

హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట 49 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. రేపు ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 1935లో కృష్ణాజిల్లా పెదపారుపూడిలో జన్మించిన రామ్మోహన్‌రావు ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. జిల్లా పరిషత్‌ పాఠశాలలో సైన్స్‌ టీచర్‌గా పనిచేశారు.

ఆ తర్వాత 1975లో ఈనాడులో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.1978లో ఈనాడు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1982లో ఈనాడు ఎండీగా పదోన్నతి పొంది… 1995 వరకు కొనసాగారు. 1992 నుంచి ఫిల్మ్‌సిటీ నిర్మాణ వ్యవహారాల్లోనూ పాలు పంచుకున్నారు. 1995లో ఫిల్మ్‌సిటీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. రామోజీ, ఈనాడు గ్రూపు సంస్థల్లో సుదీర్ఘకాలం పనిచేసిన రామ్మోహనరావు… రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు… సహాధ్యాయి, బాల్య స్నేహితుడు.

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News