‘ఒకే ఒక జీవితం’ సక్సెస్ మీట్ 

Must Read

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. శర్వానంద్, అమల అక్కినేని, నిర్మాత ఎస్ఆర్ ప్రభు, వెన్నెల కిషోర్, శ్రీకార్తిక్, సుజీత్ ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు.

శర్వానంద్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన తర్వాత థియేటర్ మొత్తం లేచి చప్పట్లు కొడుతున్నారు. ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది. దీని కోసమే కదా సినిమాల్లోకి వచ్చామనిపించింది. ఈ సినిమా ఎంత విజయం సాధిస్తుంది, ఎంత కలెక్ట్ చేస్తుందనే అటుంచితే థియేటర్ లో చప్పట్లు వినాలనిపించింది. ప్రేక్షకులు నేను కోరుకున్న ప్రేమని ఇచ్చారు. సినిమా చూసిన అందరూ హత్తుకుంటున్నారు. ఇంతకంటే ప్రేమ ఏం కావాలి. నా చుట్టూ పక్కల వున్న వాళ్ళంతా నేను సక్సెస్ కొట్టాలని కోరుకున్నారు. ఇదే నా మొదటి సక్సెస్. వంశీ శేఖర్ చాలా ఆప్యాయంగా హత్తుకున్నారు. నన్ను నడిపిస్తున్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమాలో చేసిన అందరూ చాలా డిఫరెంట్ గా అనిపించాం. దీనికి కారణం మా దర్శకుడు శ్రీకార్తిక్. ఇంత గొప్ప కథని రాసిన శ్రీకార్తిక్ కు కృతజ్ఞతలు. అతని మొదటి సినిమాలో భాగమైనందుకు చాలా గర్వంగా వుంది. అమల గారితో పని చేయడం గౌరవంగా వుంది. అమల గారు కనిపించగానే థియేటర్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అమల గారు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సుజీత్ సినిమాని అద్భుతంగా చూపించారు. నిర్మాత ప్రభుగారు ధైర్యం గల నిర్మాత. ఇలాంటి సినిమా చేయాలంటే ధైర్యం వుండాలి. సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. వర్డ్ అఫ్ మౌత్ తో సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రేక్షకులు. ప్రతి షోకి ప్రేక్షకులు డబల్ అవుతున్నారు. ఈ రోజు షోలు మొత్తం ఫుల్ అయ్యాయి. ప్రేక్షకులు, మీడియా మిత్రులు సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సక్సెస్ వారిదే. ప్రేక్షకులకు అందరికీ కృతజ్ఞతలు. ఒకే ఒక జీవితం. ఎంజాయ్ యువర్ లైఫ్” అన్నారు

అమల అక్కినేని మాట్లాడుతూ.. ఒకే ఒక జీవితం ప్రేక్షకులకు నచ్చింది. అందరూ సినిమాని ప్రశంసిస్తున్నారు. శర్వానంద్ పరిపూర్ణ నటుడు. శర్వాతో వర్క్ చేయడం ఆనందంగా వుంది. రీతూ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి అందరూ చక్కగా చేశారు. శ్రీకార్తిక్ సినిమాకి అద్భుతంగా దర్సకత్వం వహించారు. నిర్మాత ప్రభు గారు చాలా సాహసం గల నిర్మాత. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. సుజిత్ శ్రీజిత్ జేక్స్ బిజోయ్ ఇలా అందరూ చాలా అద్భుతంగా చేశారు. యువత ధైర్యంగా జీవితాన్ని ఎదురుకొని విజయం సాధించే మార్గం చూపే సినిమా ఇది. ఈ సినిమాకి అందరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. ఈ సినిమాని ఎంతో గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు”అని తెలిపారు.

నిర్మాత ఎస్ఆర్ ప్రభు మాట్లాడుతూ.. సినిమాకి అన్ని ప్రాంతాల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మంచి కలెక్షన్స్ రాబడుతోంది. సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం పని చేసిన మా టీంకి కృతజ్ఞతలు. సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు మరోసారి మా టీం తరపున కృతజ్ఞతలు’ అని తెలిపారు

వెన్నెల కిషోర్ మాట్లాడుతూ..నేను చాలా స్ట్రాంగ్ అని ఫీలౌతా. కానీ ఇందులో అమల గారి ఎంట్రీ తర్వాత కన్నీళ్లు ఆగలేదు. ఈ సినిమాలో మంచి పాత్రని ఇచ్చిన దర్శకుడు కార్తిక్ కి కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాని ఇప్పించిన శర్వానంద్ కి థాంక్స్. ప్రియదర్శి కూడా చాలా సపోర్ట్ చేశారు. అమల గారితో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నా. సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు” తెలిపారు

శ్రీకార్తిక్ మాట్లాడుతూ.. ఒకే ఒక జీవితం అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. సినిమా అందరికీ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం గొప్ప విజయంగా భావిస్తున్నా. సినిమాని చూసిన ప్రేక్షకులు చాలా తృప్తిని వ్యక్తం చేస్తున్నారు. శర్వానంద్ గారి నటనని ప్రేక్షకులు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. శర్వానంద్- అమల గారు తల్లీ కొడుకులు గా ప్రేక్షకుల మనసుని హత్తుకున్నారు. వెన్నెల కిషోర్ పాత్రకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.  ఈ సినిమాకి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. చిరకాలం గుర్తిండిపోయే సినిమా ఇది. మీ ఫ్యామిలీ తో కలసి సినిమాని థియేటర్ లో చూసి ఆనందించండి” అని కోరారు.

సుజీత్ మాట్లాడుతూ.. ఒకే ఒక జీవితం పెద్ద విజయం సాధించడం చాలా ఆనందంగా వుంది. శర్వానంద్, అమల గారి తో పని చేయడం సంతోషంగా వుంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాని తీశారు. పచాలా నిజాయితీగా తీసిన ఈ సినిమాని ప్రేక్షకులు అంతే గొప్పగా ఆదరించడం ఆనందాన్ని ఇస్తుంది” అన్నారు

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News