Categories: న్యూస్

కృష్ణ వ్రింద విహారి’ టైటిల్ సాంగ్ విడుదల

వెర్సటైల్ హీరో నాగశౌర్య , అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రంలో రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. బ్రాహ్మణ కుర్రాడిగా, ఉద్యోగం మీద నగరానికి వచ్చిన తర్వాత  అర్బన్ కుర్రాడిగా అలరించనున్నాడు. ట్రైలర్‌ లో తన నటనతో అదరగొట్టాడు నాగశౌర్య. ఈరోజు చిత్ర బృందం టైటిల్ సాంగ్‌ని లాంచ్ చేసింది.

ఈ పాటలో నాగ శౌర్య ఒక ఇరకాట పరిస్థితిలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. అతని ప్రేమలో సమస్య తో పాటు కుటుంబంతో కూడా చిక్కొచ్చింది. అంతేకాకుండా వెన్నెల కిషోర్ కోమా నుండి మేల్కొలపడానికి ఎదురు చూస్తున్నాడు నాగ శౌర్య .

దర్శకుడు అనీష్ కృష్ణ అండ్ టీమ్ ఈ సాంగ్‌ని హిలేరియస్ గా ప్రజంట్ చేశారు. మహతి స్వర సాగర్ క్యాచి నెంబర్ ని స్కోర్ చేయగా, రామ్ మిరియాల  ఎనర్జిటిక్ గా పాడారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం ఆకట్టుకుంది.

ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించిన చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. శౌర్య తల్లిగా అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ కనిపించనున్నారు.

శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటర్.

‘కృష్ణ వ్రింద విహారి’ సెప్టెంబర్ 23న విడుదల కానుంది.

తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు

సాంకేతిక విభాగం:

దర్శకత్వం:  అనీష్ ఆర్. కృష్ణ

నిర్మాత: ఉషా ముల్పూరి

సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి

బ్యానర్: ఐరా క్రియేషన్స్

సంగీతం: మహతి స్వరసాగర్

డివోపీ: సాయిశ్రీరామ్

సహ నిర్మాత: బుజ్జి

ఎడిటర్ – తమ్మిరాజు

ఆర్ట్ డైరెక్టర్ – రామ్‌ కుమార్

డిజిటల్ హెడ్: ఎం.ఎన్.ఎస్ గౌతమ్

పీఆర్వో: వంశీ, శేఖర్

Tfja Team

Recent Posts

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

19 hours ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

19 hours ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

19 hours ago

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో…

2 days ago

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో‘అగధ’

ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…

2 days ago

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి -ఎం.వెంకయ్య నాయుడు

అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…

2 days ago