రవితేజ చేతుల మీదుగా అధర్వ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ విడుదల

Must Read

యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త సినిమా అధర్వ. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా మాస్ మహారాజా రవితేజ చేతులు మీదుగా ఈ సినిమా తెలుగు టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ విడుదల చేశారు. నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించేవరకు ఈ కేసును వదిలిపెట్టను సార్.. అంటూ హీరో చెబుతున్న డైలాగ్స్ ఈ మోషన్ పోస్టర్‌ లో హైలైట్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ అట్రాక్షన్ గా నిలిచింది. అతి చిన్న వీడియోతోనే సినిమాపై ఆసక్తి పెంచేశారు మేకర్స్. అధర్వ అంటూ పడిన టైటిల్ బోల్డ్ నలుపు అక్షరాలతో వ్రాయబడి ఉండగా, మధ్య పదం మాత్రం DNA రేఖాచిత్రంతో ఎరుపు రంగులో పెయింట్ చేయబడటం సినిమాలో ఉన్న వైవిధ్యాన్ని బయటపెడుతోంది.

ది సీకర్ ఆఫ్ ది ట్రూత్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోల్చితే ఈ సినిమా డిఫరెంట్ అనుభూతి కలిగిస్తుందని తాజాగా వదిలిన మోషన్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. అదేవిధంగా డీజే టిల్లు, మేజర్ లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు బాణీలు కట్టడం విశేషం. ఆయన మ్యూజిక్ సినిమాకు మేజర్ అసెట్ అంటున్నారు మేకర్స్.

Atharva Motion Teaser - Telugu | Karthik Raju | Simran Choudhary | Mahesh Reddy | Sricharan Pakala|

ఈ సినిమాకు చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్రంలో సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

టెక్నికల్ క్రూ:
రైటర్, డైరెక్టర్: మహేష్ రెడ్డి
ప్రొడ్యూసర్: సుభాష్ నూతలపాటి
బ్యానర్: పెగ్గో ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ: నూతలపాటి నరసింహం, అనసూయమ్మ
మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల
DOP: చరణ్ మాధవనేని
ఎడిటింగ్: SB ఉద్ధవ్
ఆర్ట్: రామ్ కుమార్
లిరిక్స్: కాసర్ల శ్యామ్, కిట్టు విస్సప్రగడ
PRO: సాయి సతీష్, పర్వతనేని

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News