ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఫ్రీ హెల్త్ క్యాంప్

Must Read

హైదరాబాదులోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…
ఆదివారం నాడు హైదరాబాద్ ఫిలింనగర్ సెంటర్లో మెంబర్లకు ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సిటీ న్యూరో సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు.

అవసరమైన వారికి ఫ్రీ మెడికేషన్ కూడా అందించారు. ప్రముఖ న్యూరాలజిస్టులు, ఆర్థోపెడిషన్లు, పలమనాలజిస్టులు, గైనకాలజిస్ట్లు, కార్డియాలజిస్టులు, పర్మనాలజిస్టులతో పాటు డెంటల్, ఐ చెకప్స్ వంటివి కూడా నిర్వహించారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ మెంబర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ లో తమ ఆరోగ్య పరీక్షలు జరుపుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ సెక్రటరీ తుమ్మల రంగారావు, కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు.

Latest News

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక దక్షిణ భారత స్టార్‌గా చరిత్ర సృష్టించిన అరవింద్ కృష్ణ

ముంబైలోని డోమ్‌లో జరిగిన మొట్టమొదటి బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో దక్షిణ భారత నటుడు, అథ్లెట్ అరవింద్ కృష్ణ సంచలనం సృష్టించారు. దిశా పటాని,...

More News