హీరో విజయ్ దేవరకొండకు సారీ చెప్పిన మరాఠా మందిర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్

Must Read

థియేటర్ లలో సినిమా ప్రదర్శన విషయంలో స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని విమర్శలు చేసిన ప్రముఖ మల్టీప్లెక్స్, థియేటర్ మరాఠా మందిర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్ విజయ్ కు సారీ చెప్పారు. సినిమాను థియేటర్ లోనే ప్రదర్శించాలని చెప్పే మనోజ్ దేశాయ్..ఓటీటీలో నేరుగా సినిమాలు రిలీజ్ చేసే హీరోలను విమర్శిస్తుంటారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ ఓటీటీలను సపోర్ట్ చేస్తున్నట్లు మాట్లాడారని తప్పుగా అర్థం చేసుకున్నారు.

ఆయన్ను విజయ్ దేవరకొండ స్వయంగా కలిసి తాను ఏం మాట్లాడాడో వివరించారు. విజయ్ వివరణ విన్న తర్వాత మనోజ్ దేశాయ్ తన విమర్శలు తప్పని తెలుసుకున్నారు. విజయ్ దేవరకొండకు సారీ చెప్పడమే కాదు ఆయన కొత్త సినిమా లైగర్ తమ దగ్గర బాగా ప్రదర్శితం అవుతోందని, ఆయన కెరీర్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. మనోజ్ దేశాయ్ మాట్లాడుతూ….విజయ్ దేవరకొండ మాట్లాడిన దాంట్లో చిన్న బిట్ మాత్రమే నాకు ఎవరో పంపారు. అది చూసి నేను అతన్ని విమర్శించాను. విజయ్ నన్ను కలిసి తానేం మాట్లాడాడో పూర్తి వీడియో చూపించాడు. అతనిపై అనవసరంగా విమర్శలు చేశానని సారీ చెప్పాను. అతని లైగర్ సినిమాకు వసూళ్లు బాగున్నాయి. ఇలాగే కష్టపడి కెరీర్ లో ఇంకా ఎదుగాలని చెప్పాను. అని అన్నారు.

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News