శర్వానంద్, శ్రీ కార్తీక్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ‘ఒకే ఒక జీవితం’  థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన అనిరుధ్ రవిచందర్

Must Read

ప్రామెసింగ్ హీరో శర్వానంద్ డిఫరెంట్ జోనర్‌ల సినిమాలు చేయడంలో తన వైవిధ్యాన్ని చాటుతున్నారు. శర్వానంద్ కెరీర్ లో 30వ చిత్రంగా తెరకెక్కిన వైవిధ్యమైన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. సైన్స్ ఫిక్షన్ నేపధ్యంతో డిఫరెంట్ కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, మరీ ముఖ్యంగా తల్లీ కొడుకుల బంధం పరంగా ‘ఒకే ఒక జీవితం’ విలక్షణమైన చిత్రం.

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ ద్విభాషా చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను తెలుగు, తమిళం రెండు భాషలలో విడుదల చేసారు. ట్రైలర్ కథాంశాన్ని, భావోద్వేగ సంఘర్షణను, విజువల్స్‌లో ఉన్నత సాంకేతిక నైపుణ్యం చూపుతుంది.

ఈ కథ పెద్ద కలలు కనే యంగ్ మ్యుజిషియన్ సంబంధించినది. అతని జీవితంలో జరిగిన ఒక వ్యక్తిగత నష్టం అతన్ని కృంగదీస్తుంది. తనికి మద్దతుగా గర్ల్ ఫ్రండ్ రీతూ వర్మ ఉన్నప్పటికీ, అతను ఒంటరి, వెలితిని భావిస్తాడు. టైం మిషన్ ని కనుకొన్న శాస్త్రవేత్త (నాజర్) రూపంలో జీవితం అతనకి మరొక అవకాశాన్ని ఇస్తుంది. గతం చాలా ఉద్వేగభరితమైనది, అదే సమయంలో విషాదకరమైనది. అతను రెండో అవకాశాన్ని ఎలా ఉపయోగించుకున్నాడు అనేది కథలో కీలకాంశం.

ఇది శర్వానంద్ కోసమే ప్రత్యేకంగారూపొందించిన పాత్రని చెప్పవచ్చు. ఈ పాత్రని శర్వానంద్ అద్భుతంగా పోషించారు. శర్వానంద్ తల్లిగా అమల అక్కినేని చక్కని నటన కనబరిచారు. రీతూ వర్మ కూల్ గా కనిపించగా,  వెన్నెల కిషోర్, ప్రియదర్శి మరో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

శ్రీ కార్తీక్ తన రచయిత, దర్శకుడిగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. కథ, కథనం అద్భుతంగా వున్నాయి. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మాతలు ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ట్రైలర్ గ్రాండ్‌నెస్‌ కనిపించింది. సుజిత్ సారంగ్ కెమెరా పనితనం ఫస్ట్ క్లాస్ అయితే, జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. శ్రీజిత్ సారంగ్ పదునైన ఎడిటింగ్ ఆకట్టుకుంది.

ఒకే ఒక జీవితం సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం తమిళంలో ‘కణం’ పేరుతో ఏకకాలంలో విడుదల కానుంది.

Latest News

Raghavendra Rao unveiled the glimpses of the movie Abhimani

Film journalist and producer Suresh Kondeti has become very popular on social media. Having already entertained audiences with several...

More News