రచయిత భగీరథను చంద్ర బాబు అభినందించారు

Must Read

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ప్రపంచంలోని తెలుగువారందరికీ స్ఫూర్తి ప్రదాతని, ఆయన నిస్వార్థ ,నిరుపమాన ప్రజాసేవకుడని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు చెప్పారు. .
ఎన్ .టి .రామారావు శత జయంతి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ భగీరథ తాను రచించిన “మహానటుడు , ప్రజా నాయకుడు -ఎన్ .టి .ఆర్ ” అన్న పుస్తకాన్ని నారా చంద్ర బాబు నాయుడు గారికి బహూకరించాడు.

శుక్రవారం సాయంత్రం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు , నిర్మాత యలమంచిలి అనిల్ బాబు, రామరాజు శ్రీనివాస్ తో కలసి భగీరథ చంద్ర బాబు నాయుడు ను మంగళగిరి లోని తెలుగు దేశం కార్యాలయంలో కలిశారు .ఎన్ .టి .రామారావు గారి శత జయంతి సందర్భంగా జర్నలిస్టుగా వారితో వున్న అనుబంధం , వారితో చేసిన ఇంటర్వ్యూలతో ” మహానటుడు , ప్రజానాయకుడు – ఎన్ .టి .ఆర్ ” అన్న పుస్తకాన్ని రచించిన జర్నలిస్టు , రచయిత భగీరథను చంద్ర బాబు నాయుడు అభినందించారు .శుక్రవారం రోజు చంద్ర బాబు నాయుడు గారి సందర్శన కోసం ఎంతో మంది వేచి వున్నా, తమతో చాలాసేపు ఆత్మీయంగా మాట్లాడినందుకు భగీరథ, రాంబాబు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు .

Latest News

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల వైవిధ్యమైన...

More News