‘ప్రసన్న వదనం’ యూనిక్ కాన్సెప్ట్ హీరో సుహాస్

సుహాస్ గారు ఈ కథలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
-దర్శకుడు చెప్పిన ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఆయన అనుకున్న స్క్రీన్ ప్లే, సర్వైవల్ డ్రామా, క్లైమాక్స్ అదిరిపోయాయి. కథ విన్న వెంటనే చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను.    

ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఎలా వుండబోతుంది ?
-ఇందులో ఆర్జే గా పని చేస్తాను. మామూలు కుర్రాడి పాత్రే. అయితే తనకున్న పేస్ బ్లైండ్ నెస్ కారణంగా ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటాడు? ఆ సమస్యలని ఎలా పరిష్కరించుకుంటాడనేది క్యారెక్టర్.  

-ఈ పాత్ర కోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు?
ఈ పాత్ర కోసం పది రోజులు వర్క్ షాప్ చేశాం. దర్శకుడితో కూర్చుని పాత్ర ఎలా వుండాలి, ఎలా ప్రవర్తించాలి? ఆ పాత్ర బౌండరీలు ఏమిటి ? ఇవన్నీ వర్క్ షాప్ లో ప్రిపేర్ ఆయన తర్వాత షూట్ కి వెళ్లాం.

షూటింగ్ సమయంలో మీరు ఎదుర్కొన్న ఛాలెంజ్స్ ఏమిటి ?
-ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు వున్నాయి. అవి చేయడం కాస్త సవాల్ గా అనిపించింది. అలాగే నాది ఫేస్ బ్లైండ్ నెస్ వున్న పాత్ర. దానికి ఎలాంటి ఎక్స్ ప్రెస్షన్స్ ఇవ్వాలనేది ఛాలెంజింగా అనిపించింది. అయితే వాటిని అచీవ్ చేశాననే అనుకుంటున్నాను.

కొత్త దర్శకుడు అర్జున్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? తన పనితీరు గురించి చెప్పండి ?
-అర్జున్ తో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. తనకి దర్శకుడిగా ఇది తొలి సినిమానే కానీ సుకుమార్ గారితో ఆయన పెద్దపెద్ద సినిమాలకి పని చేశారు. తనకి చాలా అనుభవం వుంది. చాలా అనుభవం వున్న దర్శకుడిలానే ఈ సినిమాని అద్భుతంగా చేశారు.  

ఈ నిర్మాణ సంస్థలో పని చేయడం ఎలా అనిపించింది ?
-ఇది నాకు హోమ్ బ్యానర్ లాంటిదే. మణికంఠ కలర్ ఫోటో ఫ్యామిలీ డ్రామాకి సహా నిర్మాత గా చేశారు. అప్పటినుంచి నాకు మంచి ఫ్రెండ్ అయిపోయారు. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని వుంది.

ఇద్దరు హీరోయిన్స్ వున్నారు కదా… వాళ్ళ పాత్రలకు కథలో ఎలాంటి ప్రాధాన్యత వుంటుంది ?
-పాయల్ రాధాకృష్ణ నాకు జోడిగా కనిపిస్తారు. రాశి సింగ్ మరో కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో ఇద్దరికీ చాల ప్రాధాన్యత వుంటుంది. లాగే నితిన్, నందు, హర్ష పాత్రలు కూడా చాలా కీలకంగా వుంటాయి.  

ఫస్ట్ కాపీ చూసే వుంటారు. ఎలా అనిపించింది ?  
-ఫస్ట్ కాపీ అన్నపూర్ణలో ఒక్కడినే చూశాను. సినిమా పూర్తయిన తర్వాత చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఆనందంతో దర్శకుడిని హత్తుకున్నాను.  సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది.  

మీ కథల ఎంపిక చాలా యూనిక్ వుంటుంది. ఒక కథని ఎంచుకున్నపుడు ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటారు?
-పర్టిక్యులర్ గా ఏమీ వుండదండీ. మామూలు ప్రేక్షకుడిలానే బ్లాంక్ మైండ్ తో కథ వింటాను. విన్నప్పుడు ఎక్సయిటింగ్, క్లాప్స్ కొట్టేలా అనిపిస్తే వెంటనే ఓకే చెప్పేస్తాను.  

ఇప్పటివరకూ మీరు చేసిన పాత్రల్లో… మీకు ఇష్టమైన మూడు పాత్రలు అంటే ఏం చెప్తారు?
-కలర్ ఫోటో లో క్యారెక్టర్ ఇష్టం. అలాగే ఫ్యామిలీ డ్రామా కూడా ఇష్టం. అందులోచాలా వేరియేషన్స్  వుంటాయి. అలాగే అంబాజీ పేటలో చేసిన పాత్ర. వీటితో పాటు నేను చేసిన అన్ని పాత్రలు ఇష్టపడే చేశాను.

భవిష్యత్ లో ఎలాంటి కథలు చేయడానికి ఇష్టపడతారు?
-పర్టిక్యులర్ గా ప్లాన్ అంటూ ఏమీ లేదు. వచ్చిన కథల్లో నచ్చిన కథలు చేసుకుంటూవెళ్తున్నాను.

మీ చేతిలో దాదాపు ఎనిమిది సినిమాలు వున్నాయని విన్నాం. ఇన్ని సినిమాలు బ్యాలెన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. వర్క్ ని బ్యాలెన్స్ చేయడానికి వ్యక్తిగతంగా ఎలాంటి క్రమశిక్షణని పాటిస్తారు?
-అవునండీ, ఎనిమిది సినిమాలు వున్నాయి. ఎనిమిది సినిమాలు బ్యాలెన్స్ చేయాలంటే నిజంగానే కష్టం. అయితే మా మ్యానేజర్స్, నేను చర్చించుకొని చాలా సమన్వయంతో చేస్తున్నాం. క్రమశిక్షణ విషయానికి వస్తే షూటింగ్ పూర్తయిన వెంటనే ఇంటికి వచ్చేస్తాను. రాత్రి పదింటికి నిద్రపోతాను. మళ్ళీ ఉదయం ఐదింటికి షూటింగ్ కి వెళ్ళిపోతాను. గ్యాప్ వచ్చిన రోజు కథలు వింటాను.

మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి ?
-దిల్ రాజు గారి నిర్మాణంలో జులైలో ఓ సినిమా విడుదల కానుంది. అది చాలా కొత్త కామెడీ ఎంటర్ టైనర్.  కేబుల్ రెడ్డి షూట్ జరుగుతోంది.  అమెజాన్ ప్రైమ్ లో కీర్తి సురేష్ గారితో చేస్తున్న ప్రాజెక్ట్ షూట్ స్టార్ట్ అవ్వాలి. కార్తిక్ సుబ్బరాజ్ గారితో ఒక సినిమా వుంది. అలాగే ఆనందరావు అడ్వంచర్స్ తో పాటు పాటు మరికొన్ని కథలు వున్నాయి.

ఫైనల్ గా ప్రసన్న వదనం గురించి ప్రేక్షకులు ఏం చెబుతారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతోంది ?
-అందరినీ అలరించే సినిమా ఇది. చాలా మంది నా కథల ఎంపిక బావుందని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా ఎక్కువ మెచ్చుకుంటారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా థ్రిల్ ఫీలౌతారు. సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూస్తారు. కొన్ని సీన్స్ కి షాక్ అవుతారు. చాలా మంచి ఎక్స్ పీరియన్స్ తో వెళ్తారు.

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

విశాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మకుటం’.. యాక్షన్ మోడ్‌లో అదిరిన టీజర్‌

'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్‌లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…

13 hours ago

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మించిన ‘మండాడి’ .. సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్

సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…

13 hours ago

“దీవాన” మీ మనసును హత్తుకునే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మూవీ – ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…

15 hours ago

సినీ ప్రముఖుల చేతుల మీదుగా‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ టీజర్, ట్రైలర్ లాంచ్

తెలుగు సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…

2 days ago

‘సింగ్ గీతం’ విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న రిలీజ్

సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…

2 days ago

అంగరంగ వైభవంగ మహేంద్రగిరి వారాహి టీజర్ విడుదల కార్యక్రమం !!!

రాజశ్యామల ‌ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…

3 days ago