జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలిమ్స్ బ్యానర్ పై జట్టి రవికుమార్ M.A. దర్శకుడిగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న చిత్రం సర్పంచ్ ప్రారంభోత్సవ వేడుకలు నేడు ఫిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోయినపల్లి హనుమంతరావు గారు (జాతీయ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల జాతీయ అధ్యక్షుడు), సీతారామస్వామి ఉపాసకులు శ్రీశ్రీశ్రీ పెండ్యాల సత్యనారాయణ గారు, హైకోర్టు అడ్వకేట్ కుడికాల ఆంజనేయులు గారు, బి. రమేష్, అంజనీ, జట్టి రజిత, అక్షర జ్ఞాన, అనోగ్న, జ్ఞాన సిద్ధార్థ, అంబేద్కర్ శాస్త్రి, బంటు ప్రవీణ్, పోతరాజు, ప్రశాంత్, సంపత్, బంటు ఆశ్రిత, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బోయినపల్లి హనుమంతరావు మాట్లాడుతూ : మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు. కరీంనగర్ గాంధీగా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ సినిమా రంగ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు జట్టి రవికుమార్ గారికి ధన్యవాదాలు. ప్రేక్షక ఫిలిమ్స్ బ్యానర్ ద్వారా వస్తున్నాయి సినిమా మంచి విజయం సాధించాలని. ముందు ముందు ఈ బ్యానర్ ద్వారా ఇంకా మంచి సినిమాలు వచ్చి దిన దినాభివృద్ధి చెందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత, దర్శకుడు జట్టి రవికుమార్ మాట్లాడుతూ : మనిషిని ముందుండి నడిపించేది జ్ఞానం అందుకని జ్ఞాన ఆర్ట్స్ అని అదేవిధంగా సినిమా సక్సెస్ కి కారణం ప్రేక్షకుడు అందుకని జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలింస్ అని పెట్టాం. ఈ సినిమాని జూన్ 20న మొదలు పెట్టి 2025 కి పూర్తి చేస్తాం. ప్రేక్షకులందరికీ ఆదరణ సపోర్ట్ మాపై ఈ సినిమాపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాణం : జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలిమ్స్
నిర్మాత మరియు దర్శకుడు : జట్టి రవికుమార్
పి ఆర్ ఓ : మధు VR
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…