‘మిస్టర్ బచ్చన్’ ధమాకా ప్లస్ లా వుంటుంది: టి.జి.విశ్వ ప్రసాద్

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. 

రవితేజ, మీ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ధమాకా రేంజ్ లో సక్సెస్ అవుతుందని భావిస్తున్నారా? 

-రవితేజ గారితో సిరిస్ అఫ్ మూవీస్ చేస్తాం. హరీష్ శంకర్ తో కొంతకాలంగా ట్రావెల్ అవుతున్నాం. రవితేజ గారు, హరీష్ లది వెరీ క్రేజీ కాంబినేష్. ఇందులో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్నాయి. ఎంటర్ టైన్మెంట్, మాస్, యాక్షన్ ఎపిసోడ్స్ పరంగా మిస్టర్ బచ్చన్ ధమాకా ప్లస్ లా వుంటుంది. ఇది కంప్లీట్ మాస్ ఎంటర్ టైనర్ మూవీ. 

ఆగస్ట్ 15కి రావాలని ముందే అనుకున్నారా? 

-సినిమా స్టార్ట్ చేసిన్నపుడే మే, జూన్ లోగ పూర్తి చేయాలనేది ప్లాన్. రిలీజ్ డేట్ అన్నది షెడ్యుల్ ప్రకారం ప్లాన్ ఇవ్వాలని అనుకున్నాం. ఒరిజినల్ గా ఆగస్ట్ 9 రిలీజ్ డేట్ అనుకున్నాం. అయితే మా సాంగ్స్ షూటింగ్ పూర్తి కాకపోవడంతో మొదట్లో డేట్ ఇవ్వలేదు. పుష్ప స్లాట్ క్లియర్ అవ్వడంతో ఆగస్ట్ 15 ది బెస్ట్ అని డేట్ ఇవ్వడం జరిగింది.

-ఆగస్ట్ 15కి రెండు పెద్ద సినిమాలు మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ వున్నాయి. ఈ రెండికి ఎలాంటి ప్రాబ్లమ్ వుండదు. రెండికి బెటర్ అవుట్ పుట్ ఈ సీజన్ లో వస్తుంది. లాంగ్ వీకెండ్ ప్లస్ అవుతుంది.

మిస్టర్ బచ్చన్ మీరు అనుకున్న బడ్జెట్ లో అయ్యిందా ? 

-రవితేజ గారు, హరీష్ శంకర్ గారి క్రేజీ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎంత గ్రాండ్ గా ఉండాలో అంత గ్రాండ్ గా తీశాం. మేము అనుకున్న బడ్జెట్టే అయ్యింది. 

హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకోవడానికి కారణం ? 

-ఇట్స్ డైరెక్టర్స్ కాల్. భాగ్యశ్రీ బోర్సే చాలా చక్కగా పెర్ఫార్ చేశారు.

రవితేజ గారితో మరో సినిమా చేసే ప్లాన్ ఉందా ? 

– ఒక నెంబర్ అంటూ అనుకోలేదు. రవితేజ గారితో కంటిన్యూగా వర్క్ చేస్తూనే వుంటాను.

మిస్టర్ బచ్చన్  పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ గురించి ? 

-మిక్కీ, హరీష్ కి ఎక్స్ ట్రార్డినరీ సింక్ వుంది. వాలిద్దరూ కూర్చుని సినిమాని ఎలాంటి మ్యూజిక్ కావాలో అంత గ్రాండ్ అవుట్ పుట్ తీసుకొచ్చారు. పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. 

మీరు హాలీవుడ్ ని చాలా దగ్గరగా పరిశీలించారు కదా.. అక్కడ టెక్నాలజీ ఇక్కడికి తీసుకురావాలనే ఆలోచన ఉందా? 

-తీసుకురావాలనేదే నా ఆలోచన. ఇప్పటికే మా ప్రొడక్షన్ కొంత టెక్నాలజీ అడాప్ట్ చేశాం.

మీరు వంద సినిమాల టార్గెట్ ఒక ఫ్యాక్టరీ మోడల్ లో మొదలుపెట్టారు కదా.. కానీ ఇప్పుడు మార్కెట్ కండీషన్ డిఫరెంట్ గా వున్నాయి. ఈ విషయంలో ఆ టార్గెట్ స్లో అయ్యిందా?

-లేదండీ. ఇప్పుడు మా నుంచి 15 సినిమాలు రిలీజ్ కి రెడీగా వున్నాయి. వచ్చేఏడాది కూడా మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే దాదాపు పది సినిమాలు రిలీజ్ కి వస్తున్నాయి. అలా నెక్స్ట్ టూ, త్రీ ఇయర్స్ ఈ లైనప్ వుంటుంది. 

మిస్టర్ బచ్చన్ ప్రిమియర్స్ ఉంటాయా ? 

-ప్రిమియర్స్ కన్ఫర్మ్ గా వుంటాయి.

రన్నింగ్ లో వున్న ప్రాజెక్ట్స్ గురించి ? 

-G2, మిరాయ్, రాజా సాబ్, సన్నీడియోల్ లో హిందీ మూవీ జరుగుతున్నాయి. కన్నడలో గణేష్ అనే యాక్టర్ తో 50 కోట్ల స్పాన్ వున్న మూవీ చేస్తున్నాం. ఇంకో మూడు కన్నడ సినిమాలు వున్నాయి. తెలుగు నాలుగైదు సినిమాలు వున్నాయి. విశ్వక్ సేన్, అనుదీప్ మూవీ, దీంతో పాటు ఈ ఏడాది మొదలయ్యే ఇంకొన్ని ప్రాజెక్ట్స్ వున్నాయి. ఇవి కాకుండా యూఎస్ లో రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నాం.  

-విశ్వం, శ్వాగ్ థియేట్రికల్ రిలీజ్ కి రెడీగా వున్నాయి. 

-ఓటీటీ రిలీజ్ ఓ ఐదు సినిమాలు రెడీగా వున్నాయి. 

రాజాసాబ్ షూటింగ్ ఎంతవరకూ వచ్చింది ? 

-దాదాపు 50పెర్సెంట్ పైనే పూర్తయింది. ఈ ఇయర్ ఎండ్ లోగ షూటింగ్ పూర్తయిపోతుంది. 

ఆల్ ది బెస్ట్ 

-థాంక్ యూ

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

5 hours ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

13 hours ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

1 day ago

“అంతా రాములోరు చూస్కుంటారు” సినిమా నుంచి బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనస్వర రాజన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "అంతా రాములోరు చూస్కుంటారు". ఈ చిత్రంలో అనస్వర రాజన్…

2 days ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమాను కుటుంబ ప్రేక్షకులు కూడా చూడొచ్చు.. ‘కడలి’ పాత్ర ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది: కథానాయిక వైష్ణవి చైతన్య

బ్లాక్ బస్టర్ 'బేబీ' జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్…

2 days ago

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గా మోహన్ వడ్లపట్ల ఘన విజయం*

▪️ ఉపాధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా మోహన్ వడ్లపట్లకు అత్యధిక మెజార్టీ ▪️ ‘మన ప్యానెల్’ ప్రభంజనం హైదరాబాద్:…

2 days ago