మాస్ మహారాజా రవితేజ రావణాసుర షూట్ పూర్తయింది.

మాస్ మహారాజా రవితేజ,  క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో అభిషేక్ పిక్చర్స్ , ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న హై-ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర‘ షూటింగ్ ఈరోజుతో పూర్తి కానుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో రవితేజ, హీరోహీరోయిన్లపై వేసిన భారీ సెట్‌లో శేఖర్ మాస్టర్ పర్యవేక్షణలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. సుధీర్ వర్మ పర్ఫెక్ట్ ప్లానింగ్ వల్ల షూటింగ్ పార్ట్ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చేసింది.

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న రావణాసురు వేసవిలో విడుదలయ్యే క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఫస్ట్ గ్లింప్స్ రవితేజ పాత్రని   విభిన్న షేడ్స్ లో చూపించగా, థీమ్ నెంబర్,  రెండవ సింగిల్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది.

సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో  అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్.

శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో  ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.

 ఏప్రిల్ 7, 2023రావణాసుర ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

తారాగణం: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.

సాంకేతిక విభాగం:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ
నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్
కథ, & డైలాగ్స్ : శ్రీకాంత్ విస్సా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: డిఆర్ కె కిరణ్
సీఈఓ: పోతిని వాసు
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాస్ రాజు
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

మైత్రి మూవీ మేకర్స్ ప్రజెంట్స్- సత్య, రితేష్ రానా, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘జెట్లీ’ మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత…

26 minutes ago

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్

మీడియా నేపథ్యంతో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం “ది బ్రేకింగ్ న్యూస్” తాజాగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల…

1 hour ago

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

1 day ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

1 day ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

1 day ago