డైనమిక్ హీరో విష్ణు నటించిన ‘కన్నప్ప’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. గత ఏడాది రిలీజ్ అయిన ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కింది. ఇక ఈ సినిమా విడుదలై ఏడాది అయిన సందర్భంగా జూన్ 27 రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రీ రిలీజ్‌లోనూ కన్నప్ప సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ‘కన్నప్ప’ మూవీని డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన సంగతి తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
‘కన్నప్ప’ ప్రాజెక్ట్‌లో మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్, బ్రహ్మానందం ఇలా ఎంతో మంది గొప్ప నటీనటులు కీలక పాత్రలను పోషించడంతో ప్యాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్‌ను దక్కించుకుంది. ఇక ఈ మూవీ అవా ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ చానెల్‌లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ సినిమా విజయవంతంగా దూసుకుపోతోంది.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…