అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతున్న “ఆర్ కే దీక్ష” మూవీ

మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు – దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్

ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “ఆర్ కే దీక్ష”. డి.ఎస్. రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ, జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్లుగా నటించగా, కిరణ్ హీరోగా కనిపించారు. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నిన్న (జూలై 3న) గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సప్తగిరి థియేటర్ ను సందర్శించి అక్కడే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – ఈ రోజు హైదరాబాద్ సప్తగిరి థియేటర్ లో మా “ఆర్ కే దీక్ష” సినిమాను చూశాం. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి సెంటర్స్ లో మా మూవీ రిలీజైంది. అన్ని చోట్లా పాజిటివ్ టాక్ ఉంది. ఇంకా కలెక్షన్స్ పెరిగాయి. ఈ రోజు సప్తగిరిలో ఆల్మోస్ట్ హౌస్ ఫుల్ అయ్యింది. ఇంకా కలెక్షన్స్ పికప్ అవుతాయని ఆశిస్తున్నాం. మూడు ప్రధాన కథల్ని కలిపి ఈ సినిమాను రూపొందించాను. మూడు జంటలు కూడా బాగా పర్ ఫార్మ్ చేశారు. కిరణ్ నటనతో పాటు యాక్షన్ సీక్వెన్సుల్లోనూ ఆకట్టుకున్నాడు. నంది నంది పాటలో అక్సా డ్యాన్సులు హైలైట్ గా నిలుస్తున్నాయి. వీరికి నంది అవార్డ్ రావాలని కోరుకుంటున్నా. నటి తులసి చేసిన క్యారెక్టర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. మా మూవీని ప్రేక్షకులంతా ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.

హీరో కిరణ్ మాట్లాడుతూ – మా “ఆర్ కే దీక్ష” సినిమాలో నేను హీరోగా నటించాను. మా చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. థియేటర్ లో ప్రతి ఒక్కరూ మా మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్ మూడొంతలు పైగా ఫిల్ అయ్యింది. పాజిటివ్ టాక్ తో మా సినిమా రన్ అవుతోంది. మా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు ఒక మంచి చిత్రాన్ని రూపొందించారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. మా హీరోయిన్ అక్సాఖాన్ పర్ ఫార్మెన్స్ కు, డ్యాన్సులకు కూడా థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్నారు.

హీరోయిన్ అక్సాఖాన్ మాట్లాడుతూ – ఈ రోజు మా “ఆర్ కే దీక్ష” సినిమాను ప్రేక్షకులతో కలిసి చూశాం. ఆడియెన్స్ రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇందుకు రామకృష్ణ గౌడ్ గారికి థ్యాంక్స్. మా మూవీలో నంది నంది సాంగ్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా మూవీని మరింతగా ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.

నటి తులసి మాట్లాడుతూ – “ఆర్ కే దీక్ష” సినిమాకు రామకృష్ణ గౌడ్ గారు సూపర్బ్ గా డైరెక్షన్ చేశారు. మా సినిమా మంచి విజయం సాధించడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. అలేఖ్య రెడ్డి, అక్సఖాన్ కాంబినేషన్ లో నేను చేసిన సీన్స్ ను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు అన్నారు.

నటీనటులు : కిరణ్, అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి, తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు.

టెక్నికల్ టీమ్:

దర్శక నిర్మాత : డా. ప్రతాని రామకృష్ణ గౌడ్
సమర్పకులు : డీఎస్ రెడ్డి
బ్యానర్స్ : ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్
సంగీతం : రాజ్ కిరణ్
ఎడిటర్ : మేఘన శ్రీను
ఫైట్స్ : రవి
డాన్స్ : ఆనంద్
పిఆర్ఓ : చందు రమేష్

TFJA

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

9 hours ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

1 day ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago