తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీ

Must Read

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఇటీవల నూతనంగా ఎన్నికైన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎఫ్‌జేఏ) కమిటీ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్రసీమకు, సినీ కార్మికులకు తెలంగాణ సీఎం అండగా నిలుస్తున్నందుకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్  24 శాఖల అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. అందులో టీఎఫ్‌జేఏ సభ్యులను ముఖ్యమంత్రికి పరిచయం చేశారు అధ్యక్షులు వైజే రాంబాబు. 

Telangana Chief Minister Revanth Reddy Meets Telugu Film Journalists Association Committee Members

జర్నలిస్టులకు టీఎఫ్‌జేఏ అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో చేయాలని తలపెట్టిన కార్యక్రమాల గురించి వివరించడానికి సమయం ఇవ్వవలసిందిగా సీఎం రేవంత్ రెడ్డిని వైజే రాంబాబు కోరగా… తప్పకుండా మరొకసారి కలుద్దామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో టీఎఫ్‌జేఏ అధ్యక్షుడు వైజే రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, ఉపాధ్యక్షులు ప్రేమ మాలిని, సంయుక్త కార్యదర్శి జీవీ రమణ – సురేష్ కొండి, ఇతర కమిటీ సభ్యులు ఉన్నారు.

Latest News

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై...

More News